- Telugu News Photo Gallery Dermatologists says that skin lotions should be used according to the weather
Skin Care: ఎలాపడితే అలా బాడీ లోషన్లు వాడేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..
బాడీ లోషన్లు వాడటం ఇప్పడు సర్వసాధారణమైపోయింది. అయితే వాటిని వాతావరణాన్ని బట్టి మారుస్తూ ఉండాలి. ప్రతిసారి ఒకే రకమైన లోషన్లను వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటిని కూడా చర్మసంబధిత వైద్య నిపుణులను అడిగి తెలుసుకోవాలి.రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్రీమ్స్ వాడుతూ ఉంటారు. శీతాకాలంలో చర్మం పగలకుండా ఉండేందుకు కొందరు కొబ్బరి నూనె కూడా వాడుతూ ఉంటారు. అలాగే వేసవి కాలంలో అయితే సన్ స్క్రీన్ లోషన్స్ వాడుతూ ఉంటారు.
Updated on: Jul 08, 2024 | 2:00 PM

బాడీ లోషన్లు వాడటం ఇప్పడు సర్వసాధారణమైపోయింది. అయితే వాటిని వాతావరణాన్ని బట్టి మారుస్తూ ఉండాలి. ప్రతిసారి ఒకే రకమైన లోషన్లను వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటిని కూడా చర్మసంబధిత వైద్య నిపుణులను అడిగి తెలుసుకోవాలి.

రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్రీమ్స్ వాడుతూ ఉంటారు. శీతాకాలంలో చర్మం పగలకుండా ఉండేందుకు కొందరు కొబ్బరి నూనె కూడా వాడుతూ ఉంటారు. అలాగే వేసవి కాలంలో అయితే సన్ స్క్రీన్ లోషన్స్ వాడుతూ ఉంటారు.

కాలానుగుణంగా ఉన్న క్రీమ్/ లోషన్స్ వాడితేనే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. లేకపోతే చర్మం తన గుణాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తద్వారా అనేక రకాలైన చర్మవ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

వాతావరణంతోనే కాకుండా కొన్ని ఇండ్లలో, స్విమ్మింగ్ ఫూల్స్, వ్యాయామం చేసుకునే క్రమంలో కూడా వివిధ రకాలా బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు. లేకపోతే స్విమ్మింగ్ తరువాత అందులోని క్లోరిన్ చర్మంపై పడి పొడిగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డర్మటాలజిస్ట్లు.

అలాగే చర్మం రఫ్ గా పొడిబారిపోయినట్లయితే వాటికి అనుగుణంగా సరైన క్రీమ్స్ వాడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల కొన్ని రోజులకు మృదువుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటిని వైద్యుల సలహా, సూచనలతో మాత్రమే ఉపయోగించాలి.




