- Telugu News Photo Gallery Cinema photos Heroine Samantha On Nebulizer Treatment After Doctor Warns Against It Telugu Actress Photos
Samantha: మరోసారి హాట్ టాపిక్ గా సమంత.! ఆ ప్రయత్నమే కొంపముంచిందా.?
హెల్త్ ఇష్యూస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, తన ప్రాబ్లమ్ నుంచి బయట పడేందుకు చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే జర్నీలో తన ఎక్స్‌పీరియన్సెస్ ఆధారంగా అప్పుడప్పుడు అభిమానులకు హెల్త్ టిప్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ టిప్స్ సమంతను చిక్కుల్లో పడేస్తున్నాయి. శాకుంతలం సినిమా రిలీజ్‌కు ముందు ఆటో ఇమ్యూనిటీ, మయోసైటిస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు సమంత.
Updated on: Jul 08, 2024 | 1:49 PM

హెల్త్ ఇష్యూస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, తన ప్రాబ్లమ్ నుంచి బయట పడేందుకు చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే జర్నీలో తన ఎక్స్‌పీరియన్సెస్ ఆధారంగా అప్పుడప్పుడు అభిమానులకు హెల్త్ టిప్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ ఈ టిప్స్ సమంతను చిక్కుల్లో పడేస్తున్నాయి. శాకుంతలం సినిమా రిలీజ్‌కు ముందు ఆటో ఇమ్యూనిటీ, మయోసైటిస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు సమంత. ఆ టైమ్‌లో తను ఫేస్ చేసిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకునేందుకు ఓ డాక్టర్‌తో కలిసి పాడ్ కాస్ట్ వీడియో చేశారు.

అప్పట్లో సమంత చేసిన పాడ్ కాస్ట్ వీడియో మీద పెద్ద దుమారమే రేగింది. ఆ వీడియోలో మెడికల్ టిప్స్ పేరుతో సమంత చెప్పిన విషయాలు జనాలను మిస్ లీడ్ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి.

తాజాగా మరోసారి అలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు సామ్. తాజాగా మరో హెల్త్ టిప్ ఇచ్చారు సామ్. మెడిసిన్స్‌కు బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ కలిపి వాడితే సరిపోతుంది అంటూ సామ్ చేసిన పోస్ట్ మీద డాక్టర్లు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

ఇలాంటి టిప్స్ చెప్పి ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేయవద్దంటూ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో హీట్ గట్టిగా రావటంతో వెనక్కి తగ్గారు సామ్.

తన అనుభవాలను షేర్ చేసుకున్నానే తప్ప ఎవరినీ మిస్ లీడ్ చేసే ఉద్దేశం లేదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతీ సారి సమంత చిక్కుల్లో పడుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు.





























