- Telugu News Photo Gallery Cricket photos See how Iconic Lord's cricket stadium fully covered in snow
Lord’s Cricket Ground: మంచుతో కప్పేసి ఉన్న ‘క్రికెట్ మక్కా’ అందాలు..
క్రిస్మస్‌కు మరికొద్ది రోజులే సమయం ఉంది. ఈ సమయంలో చలి బాగా ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ వంటి మంచు దేశాలు అయితే ఈ కాలంలో మంచుతో కప్పేసి ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ లార్స్డ్ స్టేడియం అందాలు ఎంతగా పెరిగాయంటే..
Updated on: Dec 13, 2022 | 7:53 AM

క్రిస్మస్‌కు మరికొద్ది రోజులే సమయం ఉంది. ఈ సమయంలో చలి బాగా ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ వంటి మంచు దేశాలు అయితే మంచుతో కప్పేసి ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ లార్స్డ్ స్టేడియంలో అదే జరిగింది. మైదానంలో కనిపించినంత మేరకు మంచు దుప్పటి పరచినట్లుగా పడి ఉంది.

ఈ డిసెంబర్ నెలలో పడే మంచు ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ స్టేడియాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. అయితే తెల్లటి దూదిలా ఉండే మంచుతో లార్డ్స్ స్టేడియం అందాలు రెట్టింపు అయ్యాయి.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో అంతర్జాతీయ స్థాయి టోర్నీలు జరగడం లేదు. అయితే దేశవాళీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కానీ బాగా కురుస్తున్న మంచు కారణంగా అక్కడ చలి మరింతగా పెరిగింది.

ఈ మైదానంలో కూడా క్రికెట్ ఆడవచ్చని మీకు తెలుసా..? మన కాశ్మీర్‌లోని చిన్న పిల్లలు అలాగే కదా క్రికెట్ ఆడుకునేది. మంచును బంతిలా తయారు చేసి స్నో క్రికెట్ ఆడుతుంటారు కాశ్మీరీ చిన్నారులు.

క్రికెట్ దేవస్థానంగా పేరున్న లార్స్డ్ స్టేడియంలో ఇప్పుడు మ్యాచ్ ఆడాలంటే మంచు తొలగిపోయేంత వరకూ వేచిచూడవలసిందే..





























