Dhoni, Sakshi Love Story: చిన్నతనంలో విడిపోయి 10ఏళ్ల తర్వాత కలిసిన సాక్షి, ధోనీలు.. ప్రేమ, పెళ్లి ఓ సినిమా స్టోరీనే..

ప్రేమ, పెళ్లి, కెరీర్ కు మంచి రిలేషన్ ఉందని సజీవ సాక్ష్యం ధోని, సాక్షిల జంట. ధోనీ సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ధోని కెరీర్ లో మరింత వేగంగా అభివృద్ధి చెందింది. భారతీయ క్రికెట్ యవనికపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోనీకి పెళ్లి తర్వాత వచ్చిన పేరు ప్రఖ్యాతలు మరింతగా పెరిగాయి. గుర్తింపు పెరగడం మొదలైంది.

Surya Kala

|

Updated on: Jul 07, 2023 | 11:36 AM

42వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎంఎస్ ధోని 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కెరీర్‌లో అప్పటి వరకూ ఉన్న గుర్తింపు మరింత అధికం అయింది. ఏప్రిల్ 2010లో IPL ఛాంపియన్ షిప్ ను అందుకున్నాడు.  అయితే సాక్షి.. ధోని  జీవితంలోకి ప్రవేశించిన అనంతరం కెరీర్ లో సక్సెస్ రేటు మరింత అధికం అయింది.    

1 / 9
ధోనీ తన చిన్నతనంలోనే సాక్షితో పరిచయం ఉంది. ఇద్దరూ రాంచీలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. అయితే సాక్షి కుటుంబం డెహ్రాడూన్‌కు షిప్ట్ అవడంతో ధోని సాక్షిల పరిచయానికి ఫుల్ స్టాప్ పడింది. తిరిగి వీరిద్దరిని కలపడానికి కాలం 10 సంవత్సరాలు తీసుకుంది.  

2 / 9
ధోనీ 10 ఏళ్ల తర్వాత క్రికెటర్‌గా టీం ఇండియాలో అడుగు పెట్టాడు. సాక్షి కోల్‌కతాలోని హోటల్ తాజ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో.. టీమిండియా ఒక మ్యాచ్ ఆడడం కోసం కోల్ కతాలోని హోటల్ తాజ్ లో బసలో చేసింది. ఆ టీమ్ లో ధోని కూడా ఉన్నాడు. అప్పుడు మళ్లీ ధోనీ, సాక్షి కలిశారు. 10 ఏళ్ల తర్వాత కలుసుకున్న ధోని, సాక్షిల చూపులు కలిశాయి. బాలుడుగా విడిపోయిన ధోనీని యువకుడిగా సాక్షి కలిసిన ఆ హోటల్‌లో ఇంటర్న్‌షిప్‌కి చివరి రోజు కావడం విశేషం. 

3 / 9
సాక్షిని తొలిచూపులోనే ధోనీ ఇష్టపడ్డాడు. సాక్షిని కలవాలని మాట్లాడాలని తహతహలాడాడు. అయితే సాక్షి ఫోన్ నెంబర్ తెలియదు.. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు.. అప్పుడు వీరిద్దరి మధ్య వారధిలా ధోని మేనేజర్ పనిచేశాడు.

4 / 9
ధోనీ మేనేజర్, స్నేహితుడు యుధ్జిత్ దత్తా .. సాక్షికి కూడా మంచి స్నేహితుడు. దీంతో సాక్షి ఫోన్ నెంబర్ ధోనికి ఇచ్చాడు. అప్పుడు ధోని మెసేజ్ చేయడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య మెసేజ్ ల పర్వం కొనసాగింది. అయితే ధోని ప్రేమని సాక్షి మొదట్లో జోక్ గా తీసుకుంది. అయితే ధోని ప్రేమ నిజమని రుజువు అయ్యాక సాక్షి కూడా రిలేషన్ షిప్ ను సీరియస్ గా తీసుకుంది. 

5 / 9
మార్చి 2008 నుండి ధోనీ , సాక్షి లు డేటింగ్ ప్రారంభించారు. అయితే ఇద్దరూ తమ ప్రేమను పెళ్లి రోజు వరకు ప్రపంచానికి కూడా తెలియకుండా గోప్యంగా ఉంచారు. 2 సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత వారిద్దరూ 4 జూలై 2010న వివాహం చేసుకున్నారు.

6 / 9
సాక్షి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ధోనీ సక్సెస్‌లో మలుపు తిరిగింది. మరుసటి సంవత్సరంలోనే అంటే 2011లో ధోనీ కెప్టెన్సీలో భారత్‌ను రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. అదే సంవత్సరంలో ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా రెండవ IPL టైటిల్‌ను అందించాడు. 

7 / 9
సాక్షితో పెళ్లి తర్వాత ధోనీ కెరీర్ ఏడాది ఏడాదికి పీక్ స్టేజ్ కు చేరుకుంది. ధోని విజయాల పర్వం పరిగెడుతూ సాగింది. 2013లో తన కెప్టెన్సీలో ఇంగ్లండ్ గడ్డపై భారత్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిపాడు. దీనితో  ధోనీ మూడు ప్రధాన ICC టైటిళ్లను అందుకున్న ఏకైక కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు. 

8 / 9

ఎంఎస్ ధోని ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇప్పటికీ ఐపీఎల్ లో కెప్టెన్ గా  విజయాల పర్వం కొనసాగిస్తూనే ఉన్నాడు. ధోనీ, సాక్షి ఎక్కడ ఉంటారో.. వారి చుట్టూ విజయం తిరుగుతుంది అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తూ ఉంటారు.   

9 / 9
Follow us
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..

ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు

కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'

IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..

Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్