- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: RCB to sign Rohit Sharma as a captain Says Team India Former Player Mohammad Kaif
IPL 2025: ‘ఆర్‌సీబీ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్.. కోహ్లీతో ట్రోఫీ ముద్దాడిస్తాడు’
IPL 2025 Rohit Sharma: రోహిత్ శర్మ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడటం అనుమానంగా ఉంది. గత సీజన్‌లో రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించారు. దీంతో బాధపడుతున్న హిట్‌మ్యాన్ ఐపీఎల్ 2025లో కొత్త జట్టుకు ఆడే అవకాశం ఉంది.
Updated on: Oct 03, 2024 | 9:36 AM

IPL 2025: IPL సీజన్-18 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సన్నాహాల మధ్య, రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ ఒక ప్రణాళికతో రావాలని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ సూచించాడు.

ఎందుకంటే, వచ్చే ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడడం అనుమానమే. కాబట్టి RCB రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి ముందుకు రావాలి. కైఫ్ కూడా రోహిత్ నాయకత్వం వహించాలని భావించాడు.

ఓ ప్రైవేట్ ఛానెల్ చిట్ చాట్‌లో కైఫ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మాత్రమే ఆడాలని చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. RCB కూడా కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది.

కాబట్టి, రోహిత్ శర్మను కొనుగోలు చేసి ఆర్సీబీని కెప్టెన్‌గా చేయడం మంచిది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తమ 17 ఏళ్ల టైటిల్ కరువుకు తెరపడగలదని మహ్మద్ కైఫ్ అన్నారు.

మొహమ్మద్ కైఫ్ ప్రకటన వైరల్ కావడంతో, రోహిత్ శర్మ RCBలో చేరడమే మంచిదని అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు. హిట్‌మ్యాన్, కింగ్ కోహ్లీ మధ్య మంచి సంబంధం ఉన్నందున, ఇద్దరు దిగ్గజాల కలయికతో RCB బలమైన జట్టును ఏర్పాటు చేయగలదని చాలా మంది వ్యాఖ్యానించారు.

కాగా, రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అలాగే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ గెలవడంలో కెప్టెన్ రోహిత్ పాత్ర కీలకం. అలా ఐపీఎల్ మెగా వేలంలో హిట్‌మ్యాన్ కనిపిస్తే అతడి కొనుగోలుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొనడం ఖాయం.




