- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: 4 Key Players Including Rohit Sharma Likely To Be Released From Mumbai Indians Ahead Of Mega Auction
IPL 2025: ముంబైకి కొత్త కెప్టెన్‌గా టీ20 డైనమైట్.. హార్దిక్‌కు కూడా హ్యాండిచ్చేశారుగా
ఐపీఎల్ 2024 కోసం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఆ వివరాలు ఇలా..
Updated on: Aug 28, 2024 | 7:21 PM

ఐపీఎల్ 2025 మెగా వేలంపై ఇంకా క్లారిటీ రాలేదు గానీ.. ఏ ఫ్రాంచైజీ.. ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేస్తుందన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.

ఐపీఎల్ 2025కు ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా రిలీజ్ చేస్తుందని ఓ టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.

ఐపీఎల్ 2024 కోసం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించింది.

దీంతో ముంబై టీం రెండుగా విడిపోయింది. రోహిత్ శర్మ గ్రూప్ ఒకవైపు, హార్దిక్ పాండ్యా గ్రూప్ ఒకవైపునకు వచ్చేసింది. అలాగే రోహిత్ శర్మకు, ముంబై ఫ్రాంచైజీకి మధ్య కూడా గొడవ జరిగినట్టు టాక్.

ఈ నేపధ్యంలో వచ్చే సీజన్‌కు ముందుగా రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యాను కూడా జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్‌లను కూడా రిలీజ్ చేయాలని ముంబై ఫ్రాంచైజీ యోచిస్తోందట.

మరోవైపు, వచ్చే సీజన్‌కు ముంబై ఇండియన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చునని టాక్.

ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మలను కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం.




