- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 Royal Challengers Bengaluru Key Player Virat Kohli Statement On His Strike Rate Critics
Virat Kohli: ‘రూంలో కూర్చొని స్ట్రైక్ రేట్‌పై మాట్లాడడం కాదు..’ నత్త నడకలాంటి బ్యాటింగ్‌పై కోహ్లీ షాకింగ్ కామెంట్స్..
IPL 2024 Virat Kohli: మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ, 'కొందరు నా స్ట్రైక్ రేట్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే స్పిన్నర్లకు నేను సరిగా ఆడలేకపోతున్నానని వాపోతున్నారు. అయితే, మైదానంలో ఉన్నప్పుడు నా దృష్టి మ్యాచ్ గెలవడమే తప్ప వ్యక్తిగత రికార్డులపై కాదు' అంటూ చెప్పుకొచ్చాడు.
Updated on: Apr 29, 2024 | 9:35 AM

ఐపీఎల్ 45వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్‌సీబీ విజయం సాధించి లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. RCB విజయంలో విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ కీలక పాత్ర పోషించారు.

విల్ జాక్స్ అజేయ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న విరాట్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి ధీటుగా బ్యాటింగ్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ బాగోలేదని చెప్పేవారికి ఖడక్ గా సమాధానమిచ్చాడు.

మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ.. 'కొందరు నా స్ట్రైక్ రేట్ గురించి ప్రశ్నలు వేస్తున్నారు. అలాగే స్పిన్నర్లకు నేను సరిగా ఆడలేకపోతున్నానని వాపోతున్నారు. కానీ, మైదానంలో ఉన్నప్పుడు నా దృష్టి మ్యాచ్ గెలవడమే తప్ప వ్యక్తిగత రికార్డులపై కాదు' అంటూ తెలిపాడు.

చాలా మంది గదిలో కూర్చుని నా స్ట్రైక్ రేట్‌ని ఎగతాళి చేస్తున్నారు. అయితే, మైదానంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఆడేవాళ్లే చెప్పగలరు. స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడటం చాలా సులభం. కానీ, విరాట్ కోహ్లీ వాస్తవికత భిన్నంగా ఉందని విమర్శకులకు తిప్పికొట్టాడు.

ఇంకా, విల్ జాక్స్, జాక్స్ తుఫాన్ బ్యాటింగ్‌తో తన భాగస్వామ్యం గురించి కోహ్లి మాట్లాడుతూ, 'జాక్స్ మొదట అనుకున్నట్లుగా ఆడలేకపోయాడని కొంచెం కోపంగా ఉన్నాడు. కానీ, మేం ఒకరికొకరు మద్దతు ఇవ్వడం గురించి చర్చించాం' అంటూ తెలిపాడు.

ఎందుకంటే ఒక్కసారి జాక్స్ క్రీజులోకి వచ్చాక అతను ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. మోహిత్ శర్మ ఓవర్లో జాక్స్ తగినంత పరుగులు చేసిన వెంటనే, నా పాత్ర పూర్తిగా మారిపోయింది.

నేను అవతలి వైపు నిలబడి, జాక్స్ ఆటను చూస్తున్నాను. జాక్స్ ప్రమాదకర ఆటతో విరుచుకపడ్డాడు. 19 ఓవర్లలో మ్యాచ్ గెలవగలమని అనుకున్నాను. కానీ దాన్ని 16 ఓవర్లలో ముగించడం అద్భుతమని అన్నాడు.




