- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Chennai Super Kings All Rounder Ravindra Jadeja Surpasses MS Dhoni Man of the match Record
IPL 2024: ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా.. ఆ లిస్టులో తొలి ఆటగాడిగా..
IPL 2024, PBKS vs CSK: ధర్మశాలలోని HPCA స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2024) 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు 139 పరుగులకే ఆలౌట్ అయి 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి దూరమైంది. చెన్నై మాత్రం తన సత్తా చాటుతూ టాప్ 4లో నిలిచింది.
Updated on: May 06, 2024 | 1:09 PM

ఐపీఎల్ (IPL 2024) 54వ మ్యాచ్ ద్వారా రవీంద్ర జడేజా సరికొత్త చరిత్రను లిఖించాడు. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా విజేతగా నిలిచాడు. బ్యాటింగ్‌లో 43 పరుగుల సహకారం అందించిన జడేజా 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.

ఈ అద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శన ఫలితంగా, రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ధోనీ పేరిట జడేజా ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, CSK తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు.

ఇంతకు ముందు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. సీఎస్‌కే తరపున 255 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 15 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు ఈ రికార్డును జడేజా బద్దలు కొట్టాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తరపున రవీంద్ర జడేజా 183 మ్యాచ్‌లు ఆడాడు. అతను 16 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజా సీఎస్‌కే తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.




