IPL 2024-RCB: ఆర్‌సీబీ టీమ్‌లో భారీ ప్రక్షాళన.. వచ్చే టోర్నీలో ఈ ప్లేయర్లు ఉండడం అనుమానమే..!

IPL 2023-Royal Challengers Bangalore: లీగ్ దశలో RCB 14 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. విశేషమేమిటంటే, ఈ ఏడు మ్యాచ్‌ల విజయాల్లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే గణనీయమైన సహకారం అందించారు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: May 31, 2023 | 11:48 AM

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే టైటిల్ గెలుస్తామన్న ఆత్మవిశ్వాసంతో టోర్నీని ప్రారంభించిన ఆర్సీబీ ఈసారి 6వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

1 / 11
లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. విశేషమేమిటంటే.. ఈ ఏడు మ్యాచ్‌ల విజయాల్లో నలుగురు ఆటగాళ్లు మాత్రమే గణనీయమైన సహకారం అందించారు.

2 / 11
వారిలో ఫాఫ్ డుప్లెసిస్(730 పరుగులు), విరాట్ కోహ్లి(639 పరుగులు), గ్లెన్ మాక్స్ వెల్(400 పరుగులు), మహ్మద్ సిరాజ్(19 వికెట్లు) టోర్నీలో మెరుపులు మెరిపించినప్పటికీ, మిగిలిన వారు ఆటకు సరిపోలేదు.

3 / 11
ఈ కారణంగానే వచ్చే జరిగే ఐపీఎల్‌ 17వ సీజన్‌కు ముందుగానే ఆర్‌సీబీ టీమ్‌కి భారీ సర్జరీ జరగనుందని సమాచారం. అంటే 16వ సీజన్‌ ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆర్‌సీబీ ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించడం దాదాపుగా ఖాయం. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ తరఫున చెత్త ప్రదర్శన కనబరర్చిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

4 / 11
1. దినేష్ కార్తీక్: 16వ సీజన్ ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ 13 ఇన్నింగ్స్‌ ఆడి 140 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో డీకేనీ ఆర్‌సీబీ నిలుపుకోవడం అనుమానమే.

5 / 11
2. మహిపాల్ లామ్రార్: 10 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన లామ్రార్ 135 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో లామ్రార్‌కు కూడా గేట్ పాస్ ఇచ్చే అవకాశం ఉంది.

6 / 11
3. అనుజ్ రావత్: ఆర్‌సీబీ తరఫున ఈ సీజన్‌లో 7 ఇన్నింగ్స్‌లు ఆడిన అనుజ్ రావత్ 91 పరుగులు మాత్రమే చేశాడు. రూ.3.4 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేసిన ఈ ఆటగాడు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టు నుంచి తప్పించడం ఖాయం.

7 / 11
4. షాబాజ్ అహ్మద్: షాబాజ్ ఈ సీజన్‌లో 42 పరుగులు రాబట్టడంతో పాటు1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అందువల్ల టీమ్ నుంచి షాబాజ్ నిష్క్రమించడం ఖాయమని చెప్పవచ్చు.

8 / 11
5. కేదార్ జాదవ్: ఆర్‌సీబీ తరఫున 1 ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన సీనియర్ ఆటగాడు కేదార్ జాదవ్ 12 పరుగులే చేశాడు. సబ్‌స్టిట్యూట్‌గా ఎంపికైన జాదవ్‌ను మళ్లీ రిటైన్ చేయడం అనుమానమే.

9 / 11
6. సుయాష్ ప్రభుదేశాయ్: ఆర్‌సీబీ తరఫున సుయాశ్ 5 మ్యాచ్‌ల్లో 4 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయినా 35 పరుగులు మాత్రమే. కాబట్టి సుయాష్‌ని కూడా విడుదల చేయవచ్చు.

10 / 11
7. కర్ణ్ శర్మ: కర్ణ్ శర్మ 7 మ్యాచ్‌ల్లో 223 పరుగులు ఇచ్చి మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. అయితే, 35 ఏళ్ల సీనియర్ ఆటగాడిని ఆర్‌సిబి వచ్చే సీజన్‌లో ఉంచుకోవడం అనుమానమే.

11 / 11
Follow us