AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ నలుగురు పిల్లల్ని కంటే.. లక్ష బహుమతి.. బంపర్ ఆఫర్ ఎందుకంటే

జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలలో జనాభా కొరత అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో ఆ దేశ ప్రభుత్వాలు తమ దేశ ప్రజలు పిల్లల్ని కనమంటూ ప్రత్యెక బహుమతులను కూడా ప్రకటించాయి. అయితే మన దేశంలో కూడా కొంత మంది రాజకీయ నేతలు పిల్లల్ని కనమని పిలుపునిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ బోర్డ్ పిల్లల్ని కనమంటూ పిలుపునిచ్చింది. అంతేకాదు నలుగురు పిల్లల్ని కన్న తల్లికి ప్రత్యేక బహుమతి ఇస్తామని కూడా ప్రకటించింది.

అక్కడ నలుగురు పిల్లల్ని కంటే.. లక్ష బహుమతి.. బంపర్ ఆఫర్ ఎందుకంటే
Brahmin Board
Surya Kala
|

Updated on: Jan 13, 2025 | 5:51 PM

Share

మధ్యప్రదేశ్ లోని రాష్ట్ర కేబినెట్ మంత్రికి సమానమైన ర్యాంక్ ఉన్న ప్రభుత్వ బోర్డు అధిపతి తాజాగా సంచలన ప్రకటన చేశారు. పరశురామ్ కళ్యాణ్ బోర్డ్‌కు నాయకత్వం వహిస్తున్న పండిట్ విష్ణు రాజోరియా పరశురామ్ కనీసం కనీసం నలుగురు పిల్లలకు జన్మనివ్వమంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు అలా నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన బ్రాహ్మణ దంపతులకు ఒక లక్ష రూపాయలను బహుమతిగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త కలకలం రేపుతోంది. పండిట్ విష్ణు రాజోరియా బ్రాహ్మణ సంస్థ అయిన పరశురామ్ కళ్యాణ్ బోర్డ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మనం మన కుటుంబంపై దృష్టి పెట్టడం ఇటీవల మానివేశాం.. ఒక బిడ్డని కని ఆగిపోతోంది నేటి యువత. ఇది రానున్న కాలంలో మరింత సమస్యాత్మకంగా మారనున్నట్లు తాను గుర్తించానని రాజోరియా చెప్పారు.

‘యువతపై తనకు చాలా ఆశలు ఉన్నాయి… వృద్ధుల నుంచి మనం పెద్దగా ఆశించలేము…భవిష్యత్తు తరాన్ని రక్షించే బాధ్యత యువతపై ఉంది. కనుక యువత నిర్వీర్యం కాకుండా ఉండాలంటే కనీసం నలుగురు పిల్లలు ఉండాలని.. అందుకనే తాను ఈ విధంగా ప్రకటన చేసినట్లు ఆయన ఇండోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. అంతేకాదు పరశురామ్ కళ్యాణ్ బోర్డ్ అధ్యక్షుడిగా తాను ఉన్నా లేకున్నా ఈ అవార్డ్ కొనసాగుతుందని రాజోరియా చెప్పారు. అంతేకాదు భవిష్యత్ తరాలను కాపాడాల్సిన భాద్యత మనదే అని భావించిన తాను ఈ ప్రకటనను వ్యక్తిగతంగా చేసినట్లు.. ఈ ఆలోచన ప్రభుత్వానికి కాదంటూ స్పష్టం చేశారు. బ్రాహ్మణ సమాజం కట్టుబాట్లను అనుసరిస్తుంది.. పిల్లల భవిష్యత్ కోసం.. ఉన్నత స్థానంలో నిలిపేందుకు పిల్లలకు మంచి విద్య, శిక్షణ అందిస్తుంది ఆయన చెప్పారు.

రాజోరియా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రాజోరియా ప్రకటనకు అధికార భారతీయ జనతా పార్టీ దూరంగా ఉండగా.. అది అతని వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత ముఖేష్ నాయక్. అంతేకాదు ఆయన తాను చేసిన ప్రకనను విషయంలో “పునరాలోచించుకోవాలని” కోరారు. అంతేకాదు రాజోరియా తనకు మంచి స్నేహితుడు.. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద సమస్య జనాభా పెరుగుదల అని ముఖేష్ చెప్పారు. పిల్లలు ఎంత తక్కువగా ఉంటే.. వారికీ మంచి విద్యను అందించడం సులభం అవుతుంది, ”అని నాయక్ అన్నారు. భవిష్యత్ లో ముస్లింలు హిందువుల సంఖ్యను మించిపోతారనేది ఒక భ్రమ అంటూ నాయక్ అన్నారు. ఇలాంటివి ఊహలు మాత్రమే.. మనం ఐక్యంగా ఉన్నప్పుడే మన దేశం శక్తివంతం అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..