- Telugu News Photo Gallery Cricket photos IND vs PAK: Rohit Sharma becomes 2nd highest run scorer in T20 World Cup history and surpasses Jayawardene
IND vs PAK: టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో ఆటగాడిగా రోహిత్.. లంక ఆటగాడికి చెక్..
India vs Pakistan, 19th Match, Group A: ఆదివారం న్యూయార్క్‌లో పాకిస్థాన్‌తో జరుగుతోన్న గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.
Updated on: Jun 09, 2024 | 10:23 PM

ఆదివారం న్యూయార్క్‌లో పాకిస్థాన్‌తో జరుగుతోన్న గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.

రోహిత్ ఈ మైలురాయిని సాధించే క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని అధిగమించాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.

పేసర్ షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్‌లో మ్యాచ్‌లోని మొదటి బంతికి రెండు పరుగులతో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో జయవర్ధనే 1015 పరుగుల స్కోరును అధిగమించాడు.

పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ , కోహ్లి తర్వాత అన్ని T20Iలలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ముగ్గురూ ప్రస్తుతం పరుగుల లిస్టులో పోటీ పడుతున్నారు.

1. విరాట్ కోహ్లీ (భారత్) - 26 ఇన్నింగ్స్‌ల్లో 1142 పరుగులు; 2. రోహిత్ శర్మ (భారత్) - 37 ఇన్నింగ్స్‌ల్లో 1023 పరుగులు; 3. మహేల జయవర్ధనే (శ్రీలంక) - 31 ఇన్నింగ్స్‌ల్లో 1016 పరుగులు; 4. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 31 ఇన్నింగ్స్‌ల్లో 965 పరుగులు; 5. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 36 ఇన్నింగ్స్‌ల్లో 901 పరుగులు.




