- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN 2nd test team india all rounder ravindra jadeja needs 1 wicket to complete 300 wickets in test format
IND vs BAN: కాన్పూర్‌లో ఖతర్నాక్ రికార్డ్.. తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్న జడ్డూ
Ravindra Jadeja: బంగ్లాదేశ్‌తో జరిగిన చెన్నై టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రత్యేక మైలురాయిని నెలకొల్పనున్నాడు.
Updated on: Sep 24, 2024 | 7:06 AM

IND vs BAN 2nd Test, Ravindra Jadeja: బంగ్లాదేశ్‌తో జరిగిన చెన్నై టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రత్యేక మైలురాయిని నెలకొల్పనున్నాడు.

నిజానికి, చెన్నైలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌తో కలిసి జడేజా 199 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ఇండియాను కష్టాల నుంచి కాపాడాడు.

అలాగే, వ్యక్తిగతంగా హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్ ఆడిన జడేజా 86 పరుగుల కీలక సహకారం అందించాడు. కానీ, కేవలం 14 పరుగుల తేడాతో సెంచరీకి దూరమయ్యాడు. జడేజాకు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో జడేజా మరో వికెట్ తీసి ఉంటే టెస్టు క్రికెట్‌లో ప్రత్యేక రికార్డు సృష్టించేవాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. అందులో జడేజా ఒక్క వికెట్ తీసి అరుదైన రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

నిజానికి కాన్పూర్ టెస్టు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వికెట్ తీసిన వెంటనే చరిత్ర సృష్టిస్తాడు. టెస్టు ఫార్మాట్‌లో రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 299 వికెట్లు తీశాడు. ఇప్పుడు కాన్పూర్‌లో వికెట్ తీయడం ద్వారా 300 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు.

అంతేకాదు, టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరపున 300 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా రికార్డులకెక్కనున్నాడు. అలాగే, భారత్ తరపున టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన 7వ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.





























