- Telugu News Photo Gallery Cricket photos From Kohli to Rohit these 6 players from the Last Champions Trophy 2017 enter into Team India Squad
Champions Trophy: 8 ఏళ్ల ప్రతీకారానికి సిద్ధమైన ఆరుగురు.. లిస్ట్‌లో మహా ముదుర్లు
Champions Trophy 2025: 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో పాక్ జట్టు 180 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.
Updated on: Jan 19, 2025 | 3:17 PM

Champions Trophy 2025: ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో గతసారి చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. అంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపించిన ఆరుగురు ఆటగాళ్లు ఈసారి కూడా సత్తా చాటనున్నారు.

విరాట్ కోహ్లీ: ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో టీమిండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాడు. ఈ సమయంలో 5 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి మొత్తం 258 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ: గత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు రోహిత్ శర్మ ఓపెనర్. 5 మ్యాచుల్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన హిట్ మ్యాన్ మొత్తం 304 పరుగులు చేసి భారత్ తరుపున టాప్ స్కోరర్ గా నిలిచాడు.

హార్దిక్ పాండ్యా: 2017లో టీమ్ ఇండియాకు ఆల్ రౌండర్‌గా ఆడిన పాండ్యా 3 ఇన్నింగ్స్‌ల ద్వారా మొత్తం 105 పరుగులు చేశాడు. 5 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు కూడా తీశాడు.

రవీంద్ర జడేజా: టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్‌గా, రవీంద్ర జడేజా గత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఈ సమయంలో, అతను 5 మ్యాచ్‌ల నుంచి 4 వికెట్లు తీసుకున్నాడు. 2 ఇన్నింగ్స్‌లలో 15 పరుగులు చేశాడు.

జస్‌ప్రీత్ బుమ్రా: ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో జస్‌ప్రీత్ బుమ్రా భారత జట్టు లీడింగ్ పేసర్‌గా కనిపించాడు. కానీ, అతను 5 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు.

మహ్మద్ షమీ: మహ్మద్ షమీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కనిపించినప్పటికీ, అతను ఏ మ్యాచ్‌లోనూ కనిపించలేదు. ఇప్పుడు షమీ తన తొలి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

2027 ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, అజింక్యా రహానే, మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ యువరాజ్ సింగ్, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.





























