- Telugu News Photo Gallery Cricket photos Father Fought With Pakistan In Indian Army, Now Son Will Defend India Against England, Here Is Dhruv Jurel Debut Figures
తండ్రి పాక్‌తో యుద్ధం.. కొడుకు ఇంగ్లాండ్‌పై భీభత్సం.. టీమిండియా ప్లేయర్ ‘312’.. ఎవరంటే?
రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తరపున ఇద్దరు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. అందులో ఒకరు సర్ఫరాజ్ ఖాన్ కాగా.. మరొకరు ప్లేయర్ నెంబర్ '312'గా బరిలోకి దిగాడు ధృవ్ జురెల్. అతడు మూడో టెస్టులో కెఎస్ భరత్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. దినేష్ కార్తీక్ టెస్ట్ క్యాప్ అందించిన ధృవ్ జురెల్..
Updated on: Feb 15, 2024 | 12:42 PM

రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తరపున ఇద్దరు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. అందులో ఒకరు సర్ఫరాజ్ ఖాన్ కాగా.. మరొకరు ప్లేయర్ నెంబర్ '312'గా బరిలోకి దిగాడు ధృవ్ జురెల్.

అతడు మూడో టెస్టులో కెఎస్ భరత్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. దినేష్ కార్తీక్ టెస్ట్ క్యాప్ అందించిన ధృవ్ జురెల్.. వ్యక్తిగత, డొమెస్టిక్ క్రికెట్ విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.!

ప్రస్తుతం ధృవ్ జురెల్‌కు ముందు పెద్ద టాస్కే ఉందని చెప్పాలి. అతడు రాజ్‌కోట్ టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిస్తే.. మరో రెండు టెస్టులకు చోటు లభిస్తుంది. ఇక ఇదే లక్ష్యంతో ధృవ్ కూడా.. తన ప్రతిభను కనబరచవచ్చు. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 312వ ఆటగాడిగా ధ్రువ్ జురెల్ నిలిచాడు.

ధృవ్ జురెల్ ఒక సైనికుడి కుమారుడు. అతని తండ్రి భారత సైన్యం తరపున కార్గిల్ యుద్ధంలో పోరాడి పాకిస్తాన్‌ను ఓడించారు. ఇక ఇప్పుడు కొడుకు క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్‌తో తలపడి.. భారత్‌కు విజయాన్ని అందించాలి.

కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ధృవ్ జురెల్.. 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 790 పరుగులు చేశాడు. అలాగే అటు 2 స్టంపింగ్‌లు, 34 క్యాచ్‌లు కూడా ఖాతాలో వేసుకున్నాడు.




