- Telugu News Photo Gallery Cricket photos Ind vs Eng 3rd Test Rohit Sharma Surpass MS Dhoni Most sixes record for India in Tests
IND vs ENG 3rd Test: ధోని మార్క్ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్.. టాప్ 6 లిస్టులో ఎవరున్నారో తెలుసా?
Rohit Sharma Surpass MS Dhoni: ప్రస్తుతం తొలిరోజు మూడో సెషన్ జరుగుతోంది. భారత్ తరపున రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. దీంతో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. రాజ్‌కోట్ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. రెహాన్ అహ్మద్‌పై 2 పరుగులు చేయడం ద్వారా కెరీర్‌లో 11వ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌పై అతనికిది మూడో సెంచరీ.
Updated on: Feb 15, 2024 | 2:38 PM

Most sixes for India in Tests: 46వ ఓవర్లో జో రూట్‌పై రోహిత్ శర్మ సిక్సర్ బాదాడు. లాంగ్ ఆన్ దిశగా వేసిన ఆ ఓవర్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో ఇది రెండో సిక్స్. దీంతో టెస్టుల్లో మహేంద్ర సింగ్ ధోని కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

టీమిండియా మాజీ సారథి ధోని పేరిట టెస్టుల్లో మొత్తం 78 సిక్సర్లు ఉన్నాయి. ఈ రికార్డును టీమిండియా సారథి రోహిత్ శర్మ బ్రేక్ చేసేశాడు.

ప్రస్తుతం ఈ లిస్టులో 91 సిక్సర్లతో రోహిత్ కంటే వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ముందున్నాడు. జార్ఖండ్ డైనమేట్ ధోని ప్రస్తుతం ఈ లిస్టులో 3 వ స్థానంలో నిలిచాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. సచిన్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 69 సిక్సులు బాదాడు. ఇక ఐదో స్థానంలో సర్ రవీంద్ర జడేజా 61 సిక్సులతో నిలిచాడు. ఇక ఆరో స్థానంలో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ 61 సిక్సులతో ఉన్నాడు.

ప్రస్తుతం తొలిరోజు మూడో సెషన్ జరుగుతోంది. భారత్ తరపున రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. దీంతో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. రాజ్‌కోట్ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. రెహాన్ అహ్మద్‌పై 2 పరుగులు చేయడం ద్వారా కెరీర్‌లో 11వ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌పై అతనికిది మూడో సెంచరీ.




