- Telugu News Photo Gallery Cricket photos Team India Captain Rohit Sharma Surpasses Sourav Ganguly in runs Record
Rohit Sharma: దాదా రికార్డ్‌ను మడతపెట్టేసిన రోహిత్.. లిస్టులో 4వ భారత ప్లేయర్‌గా హిట్‌మ్యాన్..
Rohit Sharma Surpasses Sourav Ganguly: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సెంచరీ సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఈ దశలో జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో నిలిచిన రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి షాక్ నుంచి జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ.. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై రోహిత్ శర్మ సెంచరీ మాత్రమే కాదు.. సౌరవ్ గంగూలీని కూడా వదిలేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 15, 2024 | 3:28 PM

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) తొందరగానే ఔట్ కాగా, శుభమన్ గిల్ (0) వికెట్ కోల్పోయాడు. రజత్ పాటీదార్ (5) వచ్చినంత త్వరగానే పెవిలియన్ చేరాడు.

ఈ దశలో జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో నిలిచిన రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి షాక్ నుంచి జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ.. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై రోహిత్ శర్మ సెంచరీ మాత్రమే కాదు.. సౌరవ్ గంగూలీని కూడా వదిలేశాడు. రాజ్‌కోట్ సెంచరీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారతీయుడిగా రోహిత్ శర్మ నిలిచాడు.

ఈ విషయంలో సౌరవ్ గంగూలీని 5వ స్థానానికి నెట్టాడు. ఇప్పుడు ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఉన్నారు. టీమిండియా తరపున 485 ఇన్నింగ్స్‌లు ఆడిన సౌరవ్ గంగూలీ మొత్తం 18433 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 106 అర్ధశతకాలు సాధించాడు.

ఇప్పుడు రోహిత్ శర్మ తన 494వ ఇన్నింగ్స్ ద్వారా 18587+ పరుగులు సాధించాడు. తద్వారా భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ భారత్ తరఫున 782 ఇన్నింగ్స్‌లు ఆడి 100 సెంచరీలు, 164 అర్ధసెంచరీలతో మొత్తం 34357 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.




