- Telugu News Photo Gallery Cricket photos CSK CEO Kashi Viswanath Speaks About Dhoni's IPL Future May Played last match in Chennai
MS Dhoni: చెన్నైలో ధోనీ చివరి ఐపీఎల్ మ్యాచ్.. క్లారిటీ ఇచ్చేసిన సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్
Dhoni's IPL Future: మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తు గురించి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. మరికొన్నాళ్లు ధోనీ ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదంటూ చెప్పుకొచ్చాడు. అయితే, తన చివరి మ్యాచ్‌ని చెన్నైలో ఆడాలని ధోనీ తన కోరికను వ్యక్తం చేశాడు. ధోనీ ఆడాలనుకున్నంత కాలం సీఎస్‌కే తలుపులు తెరిచి ఉంచుతుందని కాశీ విశ్వనాథ్ అన్నాడు.
Updated on: Nov 12, 2024 | 8:07 AM

Dhoni's IPL Future: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏళ్లు గడిచాయి. అయితే, ధోని మాత్రం ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అయితే, గత రెండు ఎడిషన్ల నుంచి ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ధోనీ కానీ, సీఎస్‌కే కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు దీనిపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ మౌనం వీడారు.

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ధోని మరింత ఆడతాడా లేదా ఐపీఎల్ 2025 అతని చివరి సీజన్ అవుతుందా అనేది ఇంకా నిర్ణయించలేదు. కానీ, ధోనీ మాత్రం చెన్నైలో తన చివరి మ్యాచ్ ఆడాలని తన కోరికను వ్యక్తం చేశాడు.

మహీ భాయ్ ఎప్పుడూ ఎవరితోనూ ఏ ఆలోచనను పంచుకోడు. ఎక్కువగా అన్ని ఆలోచనలను తమలో ఉంచుకుంటుంటాడు. కానీ, నిర్ణయం తీసుకున్న మరుక్షణమే దాన్ని బయటకు చెప్పేస్తాడు. సీఎక్‌కే, అతని అభిమానుల పట్ల ఉన్న అభిరుచి కోసం, ధోనీ తన చివరి మ్యాచ్ చెన్నైలో ఆడతానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.

వీలైనంత ఎక్కువగా ఆడాలని మేం కోరుకుంటున్నాం. ధోనీ ఆడదలుచుకున్నంత కాలం సీఎస్‌కే తలుపు తెరిచే ఉంటుంది. అతని గురించి తెలుసుకుని, అతని నిబద్ధత చూసి, అతను సరైన నిర్ణయం తీసుకుంటాడని నేను నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ధోనీతో పాటు, CSK ఫ్రాంచైజీ మెగా వేలానికి ముందు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (రూ. 18 కోట్లు), మతీషా పతిరానా (రూ. 13 కోట్లు), శివమ్ దూబే (రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ. 18 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న సీఎస్‌కే తన పర్సు నుంచి రూ.65 కోట్లు, రూ.55 కోట్లు వెచ్చించింది.




