- Telugu News Photo Gallery Cricket photos From rohit sharma to kl rahul and axar patel these 3 indian cricketers to become father very soon
Team India: త్వరలో తండ్రులుగా ప్రమోషన్ పొందనున్న ముగ్గురు టీమిండియా క్రికెటర్లు.. ఎవరంటే?
Team India Cricketers: టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో తలపడుతున్నారు. అయితే, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు కొంతమంది ఆటగాళ్లు ఆసీస్ బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టీమిండియా ఆటగాళ్లు గుడ్‌న్యూస్ అందుకోనున్నారు. వారెవరో ఓసారి తెలుసుకుందాం..
Updated on: Nov 12, 2024 | 9:18 AM

3 Indian Cricketers to Become Fathers: భారత్‌లో ఇతర క్రీడల కంటే క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. భారతీయ క్రికెటర్లతో పాటు వారి కుటుంబసభ్యుల వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉంటారు. అయితే, ఈ కారణంగా క్రికెటర్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంటాయి. వీటిలో కొన్ని నిజం అవుతుంలాయి. మరికొన్ని పుకార్లుగా మిగిలిపోతుంటాయి.

తాజాగా భారత క్రికెటర్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే రెండోసారి తల్లి కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇంతవరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే, ప్రస్తుతం తమ ఇంటికి కొత్త అతిథిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్న ముగ్గురు క్రికెటర్లను ఓసారి చూద్దాం..

3. అక్షర్ పటేల్: భారత క్రికెటర్ అక్షర్ పటేల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. అక్టోబర్ 8, 2024న, అతను తన సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తన భార్యతో కలిసి ఓ ప్రత్యేక వీడియోను కూడా షేర్ చేశాడు. అక్షర్ తన బిడ్డను స్వాగతించడానికి సన్నాహాల వీడియోను పంచుకున్నాడు. ఇందులో అతని భార్య కూడా కనిపిస్తుంది. ఈ వార్తలకు కొన్ని రోజుల ముందు, అక్షర్ పటేల్ కూడా కపిల్ శర్మ షోలో సరదాగా సూచించినా.. ఆ తర్వాత నిజమని తేలింది.

2. కేఎల్ రాహుల్: భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ నవంబర్ 8, శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. తన పోస్ట్‌లో, 'మా అందమైన ఆశీర్వాదం 2025లో త్వరలో రాబోతోందంటూ' పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని ఈ పోస్ట్ స్పష్టంగా చెబుతోంది.

1. రోహిత్ శర్మ: భారత క్రికెట్ జట్టు వన్డే, టెస్టు ఫార్మాట్ల కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో రెండోసారి తండ్రి కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే మళ్లీ గర్భవతి అంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, రోహిత్ శర్మ మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడంలేదనే వార్తలకు ఇది బలం చేకూర్చుతోంది. అసలు విషయం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.




