- Telugu News Photo Gallery Cricket photos Team India Reach To Centurion For South Africa vs India, 3rd T20I
IND vs SA: సెంచూరియన్‌లో సెంచరీ హీరో ఎవరు.. గెలిపించే వీరుడెవరంటే?
South Africa vs India, 3rd T20I: సెంచూరియన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో విజయం సాధించాయి. తద్వారా మూడో మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కోల్పోకుండా సేఫ్ జోన్‌లో ఉంటుంది.
Updated on: Nov 12, 2024 | 12:46 PM

South Africa vs India, 3rd T20I: భారత్-దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మూడో మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పుడు సెంచూరియన్ సిటీకి చేరుకున్నాయి.

మూడో టీ20 బుధవారం సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్స్ పార్క్ మైదానంలో జరగనుండగా, ఈ మ్యాచ్ కోసం టీమ్‌ఇండియా కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.

ఈ సిరీస్‌లో టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ కనిపించాడు. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు వెళ్లనున్నారు. అందువలన దక్షిణాఫ్రికా సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ నియమితులయ్యారు.

అలాగే సెంచూరియన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో విజయం సాధించాయి. తద్వారా మూడో మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కోల్పోకుండా తప్పించుకోవచ్చు. దీంతో స్పోర్ట్స్ పార్క్ మైదానంలో ఇరు జట్ల నుంచి అద్భుతమైన ప్రదర్శన ఆశించవచ్చు.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ , విజయకుమార్ వైశాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.




