- Telugu News Photo Gallery Cricket photos BIG Update On Virat Kohli's Comeback in Indian Cricket Team and ipl 2024
Virat Kohli: కింగ్ కోహ్లీ రీఎంట్రీపై కీలక అప్‌టేడ్.. మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడంటే?
Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. దీని తర్వాత కింగ్ కోహ్లి మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తాడనే ప్రశ్న తలెత్తుతోంది. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు అందుబాటులో లేని కోహ్లి.. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల అతను మొత్తం సిరీస్‌కు అందుబాటులో లేడని బీసీసీఐ తెలిపింది. విరాట్ కోహ్లీ పునరాగమనానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 11, 2024 | 1:33 PM

భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు అందుబాటులో లేని కోహ్లి.. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల అతను మొత్తం సిరీస్‌కు అందుబాటులో లేడని బీసీసీఐ తెలిపింది.

ఆ తర్వాత, కింగ్ కోహ్లి ఎప్పుడు మళ్లీ యాక్షన్‌లోకి వస్తాడా? అనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు ప్రస్తుత సమాధానం జూన్ మొదటి వారంలో అనే వార్త వినిపిస్తోంది. అంటే విరాట్ కోహ్లీ మళ్లీ భారత జట్టు జెర్సీలో కనిపించాలంటే జూన్ వరకు ఆగాల్సిందే.

ఎందుకంటే భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మార్చి 11న ముగియనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఏ మ్యాచ్ ఆడడం లేదు. అయితే భారత జట్టు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ కూడా ప్రారంభం కానుంది.

అంటే, విరాట్ కోహ్లీ ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈసారి ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే కింగ్ కోహ్లి ఆర్సీబీ తరపున ఆడుతూ మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు.

ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించనున్నాడు.

అంటే, విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి రావాలంటే ఐపీఎల్ వరకు ఆగాల్సిందే. అలాగే, టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ టీమిండియా తరపున జూన్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.

చివరి మూడు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (కీపర్), కెఎస్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.




