- Telugu News Photo Gallery Cricket photos This is the reason why shreyas iyer out of team india for next three tests against england in home series
వెళ్లి రంజీ ఆడుకో భయ్యా.! నీ ఆటకో దండం.. స్టార్ ప్లేయర్‌ను పక్కనపెట్టేసిన టీమిండియా..
రెండు టెస్టులు ముగిశాయి. మూడో టెస్టుకు సమయం ఆసన్నమైంది. కొంచెం గ్యాప్ దొరకడంతో టీమిండియా ప్లేయర్స్‌కు విశ్రాంతి కూడా దొరికింది. అలాగే అటు సెలెక్టర్లు కూడా చివరి మూడు టెస్టులకు టెస్ట్ జట్టును ప్రకటించేశారు. ఇందులో వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ మొత్తం సిరీస్‌కు దూరం కాగా..
Updated on: Feb 11, 2024 | 11:58 AM

రెండు టెస్టులు ముగిశాయి. మూడో టెస్టుకు సమయం ఆసన్నమైంది. కొంచెం గ్యాప్ దొరకడంతో టీమిండియా ప్లేయర్స్‌కు విశ్రాంతి కూడా దొరికింది. అలాగే అటు సెలెక్టర్లు కూడా చివరి మూడు టెస్టులకు టెస్ట్ జట్టును ప్రకటించేశారు. ఇందులో వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ మొత్తం సిరీస్‌కు దూరం కాగా.. ఫిట్‌నెస్ పూర్తిగా సాధించకపోయినా.. రాహుల్, జడేజాలకు చోటు దక్కింది. అయితే అనూహ్యంగా శ్రేయాస్ అయ్యర్‌కు ఉద్వాసన పలకడం గమనార్హం.

అయితే శ్రేయాస్ అయ్యర్‌ను గాయం కారణంగా సెలెక్టర్లు పక్కనపెట్టలేదని తెలుస్తోంది. అతడి ఆటతీరు పేలవంగా ఉండటమే ఈ ఉద్వాసనకు కారణమని ఇన్‌సైడ్ టాక్. రెండో టెస్టులో వెన్ను నొప్పితో అయ్యర్ బాధపడినా.. ఇప్పుడు ఫిట్‌గానే ఉన్నాడట. గాయం తర్వాత రీ-ఎంట్రీలో అయ్యర్ స్కోర్లు 4, 12, 0, 26, 31, 6, 0, 4 నాటౌట్, 35, 13, 27, 29గా ఉన్నాయి. చివరిగా 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే 87 పరుగులు చేశాడు.

అప్పటి నుంచి ఇప్పటివరకు అయ్యర్ బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ రాలేదు. ఇంగ్లాండ్ సిరీస్‌కి ముందు రంజీలలో ఆడిన శ్రేయాస్ అయ్యర్.. బ్యాట్‌తో 48 పరుగులు చేసినా.. 145కు పైగా ఓవర్లు ఫీల్డింగ్ చేసినా.. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేసరికి అంతగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు టెస్టుల్లో కలిపి 104 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో చివరి మూడు టెస్టులకు అయ్యర్‌కు చోటు దక్కలేదు.

అయ్యర్‌ను ఇంజ్యూరి కారణంగా పక్కన పెట్టడంలో అస్సలు ఛాన్స్ లేదు. రెండో టెస్టులో బెన్ స్టోక్స్‌ను అతడు అవుట్ చేసిన విధానంతోనే.. అయ్యర్ పూర్తిగా ఫిట్ ఉన్నాడని చెప్పొచ్చు అని ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో చెప్పుకొచ్చాడు ఒక బీసీసీఐ అధికారి. టీంకి అతడి నుంచి పరుగులు కావాలి.. కానీ అది జరగట్లేదు. అదే అతడి ఉద్వాసనకు అసలు కారణం అని తెలిపాడు.

దీనికి తగ్గట్టుగానే జట్టు ప్రకటన సమయంలో కోహ్లీ, జడేజా, రాహుల్ గురించి బీసీసీఐ సెలెక్టర్లు చెప్పారు తప్పితే.. అయ్యర్ దూరం కావడానికి గల కారణాలు చెప్పలేదు.




