- Telugu News Photo Gallery Corn for Health: Health Benefits Of Corn That Make It A Superfood Worth Having In Winters
Corn for Health: గుండె జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే మొక్క జొన్న తినాల్సిందే..
మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉడకబెట్టి, వేయించి ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న ఆరోగ్యానికి మంచిది. మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరడంలో సహాయపడుతుంది. మొక్కజొన్న పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు చెడు..
Updated on: Dec 12, 2023 | 8:55 PM

మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉడకబెట్టి, వేయించి ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న ఆరోగ్యానికి మంచిది. మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరడంలో సహాయపడుతుంది. మొక్కజొన్న పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మొక్కజొన్న తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నిత్యం వ్యాయామం చేసేవారు, జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసేవారు ఆహారంలో మొక్కజొన్నను తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌గా కూడా మొక్కజొన్న తీసుకోవచ్చు.

బరువు అదుపులో ఉండాలంటే మొక్కజొన్న తినొచ్చు. మొక్కజొన్నలోని ఫైబర్ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా అదనపు కేలరీలు తీసుకోకుండా కూడా దూరంగా ఉండవచ్చు.

మొక్కజొన్నలో లుటిన్, జియాక్సంతిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇది వయస్సు సంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొక్కజొన్నలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.





























