- Telugu News Photo Gallery Business photos Last Date To Update Biometrics For LPG Cylinder Is 31st December Or Else Subsidy Will Be Stopped, Know How To Update Biometric
LPG Biometric Update: గడువు దగ్గరపడుతోంది.. ఈ పని చేయకపోతే గ్యాస్ సబ్సిడీ అందదు
బయోమెట్రిక్ అప్ డేట్ చేసేందుకు గ్యాస్ షాపుకు వెళ్లాలని మొదట్లో వినిపించినా.. తర్వాత గ్యాస్ డెలివరీ చేసేవారే కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ అప్ డేట్ చేస్తారని తెలిసింది. గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి మొబైల్‌లో ప్రత్యేక యాప్ ఉంటుంది. అక్కడ కస్టమర్ వేలిముద్ర లేదా ముఖం స్కాన్ చేస్తారు. మీ ఇంటి వద్ద డెలివరీ బాయ్ మొబైల్‌లో బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేస్తారు. అంతేకాకుండా..
Updated on: Dec 12, 2023 | 8:37 PM

డిసెంబర్ నెల ముగియబోతోంది. ఇక మిగిలింది కొద్ది రోజులు మాత్రమే. అయితే ప్రతినెల ఒకవతేదీ నుంచి కొన్ని నిబంధనలలో మార్పులు జరుగుతుంటాయి. వాటిని ముందస్తుగా గమనించి పనులు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే ఆర్థిక నష్టంతో పాటు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ నెలాఖరులోపు బయోమెట్రిక్ అప్ డేట్ చేయాలి. లేదంటే, కొత్త సంవత్సరం నుంచి మీకు ఎల్‌పిజి సిలిండర్ సబ్సిడీ లభించదు. కేంద్రం మార్గదర్శకాలపై ఉత్కంఠ నెలకొంది.

గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందేందుకు బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేసింది. ఈ నెలాఖరులోగా బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుంది. ఈ బయోమెట్రిక్‌ను డిసెంబర్ 31లోగా అప్‌డేట్ చేయాలి. చాలా మంది కస్టమర్‌లకు ఇప్పటికీ ఈ సమాచారం గురించి తెలియదు. బయోమెట్రిక్ అప్‌డేట్ నిబంధనలపై గ్యాస్ డీలర్లలో కూడా గందరగోళం ఉంది.

బయోమెట్రిక్ అప్ డేట్ చేసేందుకు గ్యాస్ షాపుకు వెళ్లాలని మొదట్లో వినిపించినా.. తర్వాత గ్యాస్ డెలివరీ చేసేవారే కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ అప్ డేట్ చేస్తారని తెలిసింది. గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి మొబైల్‌లో ప్రత్యేక యాప్ ఉంటుంది. అక్కడ కస్టమర్ వేలిముద్ర లేదా ముఖం స్కాన్ చేస్తారు.

మీ ఇంటి వద్ద డెలివరీ బాయ్ మొబైల్‌లో బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఇంటి వద్దే కాకుండా గ్యాస్ కార్యాలయానికి వెళ్లి కూడా కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు.





























