Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinks for Health: ఎముక పటుత్వానికి పుష్టినిచ్చే పానియాలు.. వీటిని తాగారంటే కీళ్ల నొప్పులు పరార్‌

జిమ్‌కు వెళ్లకపోయినా, వాకింగ్‌కు వెళ్లేవారిలో కూడా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వస్తుంటాయి. శారీరకంగా చురుగ్గా ఉన్నప్పటికీ, శరీరంలో పోషకాలు లోపిస్తుంటాయి. విటమిన్ డి, కాల్షియం లోపం వల్ల ఎముకల సమస్యలు పెరుగుతాయి. శీతాకాలంలో, తక్కువ సూర్యకాంతి కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తుతుంది. శరీరానికి తగినంత కాల్షియం ఉన్నప్పటికీ, అది సరిగ్గా పనిచేయదు. శీతాకాలంలో ఈ 6 రకాల పానియాలు తాగడం ద్వారా ఎముకల సమస్యలను తగ్గించవచ్చు.

Srilakshmi C

|

Updated on: Dec 12, 2023 | 9:28 PM

1 / 5
పాలలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. పాలు ఇష్టం లేనివారు బాదం పాలు లేదా సోయా పాలు తాగవచ్చు. పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఎముకల సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

2 / 5
శరీరంలో కాల్షియం లోపాన్ని భర్తీ చేయడానికి తాజా కూరగాయలతోపాటు స్మూతీలు తాగొచ్చు. పాలకూరతో చేసిన స్మూతీలు తాగడం వల్ల ఎముకలకు కావల్సిన పోషకాలు అందుతాయి. ఇతర పోషకాహార లోపాలు కూడా భర్తీ అవుతాయి. చలికాలంలో బ్రోకలీ జ్యూస్‌ తాగవచ్చు. ఈ రసంలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఈ వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి.

3 / 5
చలికాలంలో నారింజపండ్లు మార్కెట్లలో ఎక్కువగా లభ్యమవుతాయి. ఈ సీజన్‌లో ఆరెంజ్ జ్యూస్ తాగితే ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. బలమైన ఎముకలను నిర్మించడంలో ఇది సహాయపడుతుంది.

4 / 5
గ్రీన్ టీ బరువు తగ్గడంతో పాటు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. మటన్ బోన్స్‌తో తయారు చేసిన సూప్‌లో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ పానీయంలో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

5 / 5
Follow us