YS Jagan: వైసీపీలోని 40 మందికి ‘నో సీట్’..! ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు..
వై నాట్ 175 అంటూ రాబోయే ఎన్నికల కోసం ఏపీ అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికే వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ముఖ్యంగా దీనికోసం సీఎం జగన్.. ఆ దిశగా పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఎమ్మెల్యేలు,ఇంచార్జిల పనితీరుపై అధినేత జగన్ మోహన్ రెడ్డి నివేదికలు తెప్పించుకుంటున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్ షాప్ జరిగిన సమయంలోనే కొంతమంది నాయకుల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. పనితీరు బాగోలేని వారిని మార్చక తప్పదని ప్రకటించారు.
వై నాట్ 175 అంటూ రాబోయే ఎన్నికల కోసం ఏపీ అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికే వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ముఖ్యంగా దీనికోసం సీఎం జగన్.. ఆ దిశగా పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఎమ్మెల్యేలు,ఇంచార్జిల పనితీరుపై అధినేత జగన్ మోహన్ రెడ్డి నివేదికలు తెప్పించుకుంటున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్ షాప్ జరిగిన సమయంలోనే కొంతమంది నాయకుల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. పనితీరు బాగోలేని వారిని మార్చక తప్పదని ప్రకటించారు. అలాంటి వారికి కొంచెం గడువు కూడా ఇచ్చారు.. అయినా పనితీరు మెరుగుపడని వారి విషయంలో సీఎం జగన్ తుది నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.. ఎన్నికలు దగ్గర పడటంతో అభ్యర్ధుల ఎంపికపై అధినేత కసరత్తు వేగవంతం చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజులగా నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న నివేదికలపై కీలక నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.. దాంట్లో భాగంగానే పనితీరు బాగోలేని నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారని చెబుతున్నారు. ఇలా సమాచారం ఇస్తున్న సమయంలో కొంతమంది నాయకులు బయటికి వస్తున్నారని.. మరికొంతమంది మాత్రం విషయం బయటకు పొక్కకుండా పార్టీలోనే కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిన కేటగిరీలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.. ఆర్కేకు సీటు విషయంలో స్పష్టత ఇవ్వడంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసారనే వాదన వినిపిస్తుంది.
సుమారు 40 మంది అభ్యర్ధులను మార్చనున్న అధినేత జగన్..
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలంటే కీలక సంస్కరణలు తప్పనిసరని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. గతంలోనే 30 మంది అభ్యర్ధులను మార్చాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ సంఖ్య మరింత పెరిగినట్లు కూడా సమాచారం.. ఉమ్మడి జిల్లాల వారీగా అభ్యర్ధుల పనితీరు, ప్రజల్లో స్పందన, సామాజిక వర్గాల ప్రభావంతో పాటు టీడీపీ-జనసేన ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేసుకుని అభ్యర్ధుల విసయంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల స్థానంలో వేరే సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోరు సాగనుంది. టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఉన్నారు.. అయితే సీఎం తెప్పించుకున్న నివేదికల ప్రకారం ఆర్కే కు సీటు ఇవ్వడం కంటే బీసీ నాయకులకు సీటు ఇస్తే గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందుకే మార్పు జరిగినట్లు చెబుతున్నారు. గతంలోనే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి కి మంగళగిరి నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ సుమారు 70 వేల బీసీ సామాజికవర్గం ఓట్లు ఉండటంతో ఆర్కే కు సీటు ఇవ్వలేమని చెప్పినట్లు తేలిసింది.
మరోవైపు గాజువాక వైసీపీ ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తండ్రి తిప్పల నాగిరెడ్డి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై గెలిచారు. అయితే ఇక్కడ దేవన్ రెడ్డి స్థానంలో యాదవ సామాజికవర్గానికి సీటు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియడంతోనే దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇదే కోవలో మరికొంతమందిని కూడా మారుస్తారని తెలిసింది. అయితే, ఇంచార్జీలను మర్చినా వారికి పార్టీలో మరో పదవి ఇచ్చేలా హామీ ఇస్తున్నారు. అయినా కొంతమంది పార్టీని వీడుతున్నారు. మొత్తానికి గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చేలా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..