- Telugu News Photo Gallery Cold Shower Vs Hot Shower: These are the reasons why hot water bath is bad for you
Hot Water Bath: రోజూ వేడినీళ్లతో స్నానం చేసేవారికి హెచ్చరిక.. లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
రోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు.. పైగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలా మందికి తెలియదు. అవును, ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేసే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి అతిగా వేడి నీటి స్నానం మంచిది కాదు. ఇది మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ వేడినీటి స్నానం ..
Updated on: Jul 11, 2024 | 12:49 PM

రోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు.. పైగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలా మందికి తెలియదు. అవును, ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేసే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి అతిగా వేడి నీటి స్నానం మంచిది కాదు. ఇది మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ వేడినీటి స్నానం చేయకూడదు. ఇది చర్మానికి హాని కలిగించడమే కాకుండా వేడి నీటి స్నానం జుట్టు రాలడం, పొడి జుట్టుకు దారితీస్తుంది. దీంతోపాటు చర్మంపై దురద వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

ప్రతిరోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒంట్లోని కండరాలు బిగుతుగా మారి వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఇది చర్మానికి హాని కలిగించడమే కాకుండా వేడి నీటి స్నానం జుట్టు సమస్యలను మరింత పెంచుతుంది.

అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి వేడి నీటి స్నానం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే వేడి నీటి స్నానం చేసిన తర్వాత ఎక్కువగా చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా తలెత్తుతుంది.

అందుకే సీజన్ ఏదైనా సరే.. అన్ని నెలల్లో గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయడం మంచిది. కాబట్టి వీలైనంత వరకు వేడి నీటితో స్నానం చేయడం తగ్గించి, ఆరోగ్యంగా ఉండండి.




