- Telugu News Photo Gallery Cinema photos Will Pawan Kalyan movies Hari Hara Veeramalu, Ustad Bhagat Singh start shooting again with plan B after being stopped
Pawan Kalyan: ప్లాన్ మార్చిన పవన్ కల్యాణ్ కెప్టెన్లు !! ఇప్పుడు ప్లాన్ బీ వర్కవుట్ చేస్తున్నారా ??
హరిహరవీరమల్లు డైరక్టర్ ఏం చేస్తున్నారు? ఉస్తాద్ భగత్ సింగ్ డైరక్టర్ ఎక్కడున్నారు? ఓజీ కెప్టెన్ ఫోకస్ దేని మీద ఉంది? సురేందర్ రెడ్డి సంగతేంటి? వరుసగా పవన్ కల్యాణ్ కెప్టెన్ల గురించి చెబుతున్నానని అనుకుంటున్నారా? యస్.... వాళ్ల గురించే మాట్లాడుకుందాం... డీటైల్డ్ గా.. వచ్చేయండి. హరిహరవీరమల్లు.. ఎప్పుడు మొదలైంది? ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది? మరెప్పుడు థియేటర్లలోకి వస్తుంది? జవాబు లేని ప్రశ్నలు ఇవి. షూటింగ్ ఇంకా పూర్తి కానే లేదు, అప్పుడే హీరో పవన్ కల్యాణ్‌కి ఎన్నికల హడావిడి మొదలైంది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Nov 19, 2023 | 9:55 PM

హరిహరవీరమల్లు డైరక్టర్ ఏం చేస్తున్నారు? ఉస్తాద్ భగత్ సింగ్ డైరక్టర్ ఎక్కడున్నారు? ఓజీ కెప్టెన్ ఫోకస్ దేని మీద ఉంది? సురేందర్ రెడ్డి సంగతేంటి? వరుసగా పవన్ కల్యాణ్ కెప్టెన్ల గురించి చెబుతున్నానని అనుకుంటున్నారా? యస్.... వాళ్ల గురించే మాట్లాడుకుందాం... డీటైల్డ్ గా.. వచ్చేయండి.

హరిహరవీరమల్లు.. ఎప్పుడు మొదలైంది? ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది? మరెప్పుడు థియేటర్లలోకి వస్తుంది? జవాబు లేని ప్రశ్నలు ఇవి. షూటింగ్ ఇంకా పూర్తి కానే లేదు, అప్పుడే హీరో పవన్ కల్యాణ్‌కి ఎన్నికల హడావిడి మొదలైంది. అందుకే ఇప్పుడు ప్లాన్ బీ మీద వర్కవుట్ చేస్తున్నారు డైరక్టర్ క్రిష్. తన దగ్గరున్న కథలతో స్టార్ హీరోలను అప్రోచ్ అవుతున్నారట. ఆల్రెడీ ఈ పనిని ఎప్పుడో స్టార్ట్ చేశారట హరీష్ శంకర్.

పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపే, హరీష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. రవితేజతో మిరపకాయ సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నారు హరీష్ శంకర్.

ఓజీతో వింటేజ్ పవన్ కల్యాణ్‌ని చూపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు సుజిత్. పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద మరింత ఇంట్రస్ట్ తో కనిపించారు. సుజిత్ మాత్రం కంప్లీట్‌గా పవన్ మూవీ మీదే ఫోకస్ చేస్తున్నారన్నది టాక్.

ఎప్పటి నుంచో పవన్ కల్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారట. పవర్‌స్టార్ మూవీ స్టార్ట్ అయ్యేలోపు విక్రమ్‌తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట సురేందర్‌రెడ్డి. ఆల్రెడీ మెగా కాంపౌండ్‌లో సైరా చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది ఈ కెప్టెన్‌కి.





























