- Telugu News Photo Gallery Cinema photos Will Actress Eesha Rebba get married to this Tamil director according to rumours see photos
Eesha Rebba: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ముద్దుగుమ్మ.. ఈషా పెళ్లాడేది ఇతడినేనా..!
అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు.. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. నటన పరంగా మంచి మార్కులే సొంతం చేసుకున్న ఈషాకు.. అంత పెద్దగా గుర్తింపు రాలేదు
Updated on: Sep 09, 2022 | 1:32 PM

తెలుగమ్మాయి ఈషా రెబ్బ (Eesha Rebba) అందం, అభినయంతో సినీపరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు.. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. నటన పరంగా మంచి మార్కులే సొంతం చేసుకున్న ఈషాకు.. అంత పెద్దగా గుర్తింపు రాలేదు

దీంతో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఓవైపు వెండితెరపై అలరిస్తూనే..మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సత్తా చాటుతుంది.

వెబ్ సిరీస్ లలో నటిస్తునే.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. చిట్ చాట్స్ అంటూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటుంది

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈషా రెబ్బ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ స్టార్ డైరెక్టర్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

వీరిద్దరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు ఈషారెబ్బ స్పందించలేదు.




