- Telugu News Photo Gallery Cinema photos Who are the South Captains walking the path of cinematic universe?
Cinematic Universe: నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
సీక్వెల్స్, పీరియాడిక్ సినిమాలు... ఇలా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాను టచ్ చేసినా, ఎక్కడో ఓ లింక్ ఉంటుంది. లింకులు అక్కడెక్కడో ఎందుకు..? ఒకే కెప్టెన్ క్రియేట్ చేసిన కేరక్టర్ల మధ్య ఉంటే ఎలా ఉంటుంది? ఆ కాన్సెప్టే ఇప్పుడు యూనివర్శ్ పేరుతో పాపులర్ అయింది. ఆల్రెడీ లోకేష్ యూనివర్శ్ మన దగ్గర ట్రెమండస్ రిసెప్షన్ అందుకుంది. మరి ఆయన బాటలో నడిచే సౌత్ కెప్టెన్లు ఎవరు?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 16, 2024 | 5:26 PM

లోకేష్ కనగరాజ్ సినిమా వస్తుందంటే, ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటని ఆరా తీయడం కన్నా, ఆయన క్రియేట్ చేసిన యూనివర్శ్ నుంచి ఏయే పాత్రలు ఇందులో కనిపిస్తాయని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు.

ఖైదీ రెఫరెన్స్ విక్రమ్‌లో వస్తే గూస్‌బంప్స్ వచ్చాయి ఆడియన్స్ కి. అలాగే లియో చూసిన వారు కూడా ఖైదీ, విక్రమ్ కేరక్టర్లను పోల్చి చూసుకుని వండర్ అయ్యారు. లోకేష్‌లాగానే ఫ్యాన్స్ కి స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని తాను కూడా ఎప్పుడో అనుకున్నట్టు చెప్పారు హరి. అయితే సింగం సీరీస్‌లో అది మిస్ అయిందని అన్నారు.

Singam 3సింగం3 సినిమా చేసినప్పుడు క్లైమాక్స్ లో ఎయిర్‌పోర్టు సీన్‌లో సామి కేరక్టర్‌ని తీసుకురావాలని ప్రయత్నించారట. అయితే అప్పుడు సామి హీరో విక్రమ్ కాల్షీట్లు దొరకకపోవడంతో కుదరలేదని చెప్పారు కెప్టెన్ హరి. ఎప్పటికైనా ఆ రెండు కేరక్టర్లతో ఓ సూపర్బ్ కాప్ యూనివర్శ్‌ని క్రియేట్ చేయాలన్నది ఆయన డ్రీమ్.

Sandeep Reddy మరి అర్జున్‌రెడ్డిని, కబీర్‌సింగ్‌ని, యానిమల్ హీరోని, స్పిరిట్‌లో ఏమైనా చూపిస్తారా? సందీప్‌రెడ్డి వంగా?... ఈ ప్రశ్నని ఆయన ముందుంచితే, ఇప్పటికైతే అలాంటి ఐడియానే లేదనేశారు ఆ క్రేజీ దర్శకుడు.

వాట్ ఎబౌట్ ప్రశాంత్‌నీల్? సలార్‌లోనే రాకీభాయ్‌ని ఇంక్లూడ్ చేస్తారని ఆడియన్స్ ఇష్టంగా ఎదురుచూశారు. అలాంటిదేమైనా ఉంటే తాను చెబుతానని ప్రామిస్ చేశారు ప్రశాంత్. మరి ఆ ప్రామిస్‌ని కేజీయఫ్3లోగానీ, సలార్2లోగానీ నిలబెట్టుకుంటారా? ఇప్పుడు ప్రశాంత్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్న టాపిక్ ఇదే. కెప్టెన్ల యూనివర్శ్‌లు సెట్స్ మీదకు వస్తే, మల్టీస్టారర్ సినిమాల హవా మరోసారి మన దగ్గర ఊపందుకుంటుంది.





























