Darling Heroines: డేరింగ్‌గా డార్లింగ్ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
డార్లింగ్ హీరోయిన్లకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు జనాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు హీరోయిన్లు.. ఒకటే మాట మీద ఉన్నారిప్పుడు. అయినా మనకు ఒకరిచ్చేదేంటి? అని కాసింత డేరింగ్‌గానే చెప్పుకుంటున్నారు. ఇంతకీ వాళ్లకు ఎవరు ఏం ఇచ్చారు? ఏం ఇవ్వలేదు? వాళ్లకు వాళ్లే ఏం క్రియేట్ చేసుకున్నారు? కమాన్ చూసేద్దాం వచ్చేయండి...
Updated on: Apr 16, 2024 | 5:14 PM

ఆదిపురుష్ సినిమా విషయంలో అందరూ ఏదో ఒక రకంగా విమర్శలు ఎదుర్కొన్నవారే. ఒక్క కృతిసనన్ మాత్రం తక్కువ నెగటివిటీతో బయటపడ్డారు. ఆ సినిమా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఫేస్ చేసినా, ఇప్పుడు మాత్రం ఫుల్ పాజిటివిటీతో ఉన్నారు.

ఇంకా చెప్పాలంటే, ఫుల్ క్లారిటీతో కనిపిస్తున్నారు. అవకాశాలు ఒకరిచ్చేదేంటి? మనకు మనమే సృష్టించుకోవాలి అని అంటున్నారు. రీసెంట్‌గా ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన కృతి సనన్‌లో ఓ రకమైన ధైర్యం కనిపిస్తోంది.

ఇలాంటిదే ఇంతకు ముందు కంగనా రనౌత్‌లోనూ ఉండేది. కంగన ఈ స్థాయికి ఎదుగుతారని తాను ముందే ఊహించినట్టు ఓ సందర్భంలో ప్రభాస్ కూడా చెప్పారు. నటిగా, డైరక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ ఫైర్ బ్రాండ్ రీసెంట్‌గా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు.

కృతిసనన్, కంగన రనౌత్‌లాగా తాప్సీ కూడా ఔట్ సైడరే. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామరస్ రోల్స్ లో సౌత్‌లో స్టార్లందరితో ఆడిపాడారు తాప్సీ. నార్త్ లో ఒక సెపరేట్ సెగ్మెంట్‌లో సినిమాలు చేసుకుంటున్నారు.

అదర్ ప్రొడ్యూసర్స్ కి సినిమాలు చేయడంతో పాటు, తనకు నచ్చిన స్టోరీలతో ఓన్ బ్యానర్‌లోనూ దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. సో డార్లింగ్ హీరోయిన్లు... ఇలా డేరింగ్‌గా స్టీరియోటైప్ యాటిట్యూడ్‌ని బద్ధలు కొట్టేస్తున్నారన్నమాట.




