తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ 'నేను శైలాజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది. తెలుగులో కాస్త గ్యాప్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.