ఊలాలా ఊలాలా అంటూ బ్యాంకాక్‌లో విజయ్ సేదదీరుతున్నారనుకుంటే పొరపాటే. బ్యాంకాక్‌కి విజయ్ వెళ్లిన మాట వాస్తవం. అయితే ఆయన వెళ్లింది సరదాగా ఎంజాయ్ చేయడానికి కాదు. ఆయన సినిమా షూటింగ్ కోసం. విజయ్ హీరోగా దళపతి 68 అనే సినిమా షూటింగ్ అక్కడ జరుగుతోంది. వెంకట్ ప్రభు డైరక్ట్ చేస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, మోహన్, జయరామ్, అజ్మల్ అమీర్, యోగిబాబు, వీటీవీ గణేష్, వైభవ్, ప్రేమ్‌జీ అమరన్ అంటూ స్టార్ కాస్ట్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది ఈ మూవీకి. ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుగుతోంది.