రోబో కాంబో రిపీట్ అవుతుందా ?? శంకర్, రజనీ స్కెచ్ అదేనా ??
పాన్ ఇండియా అన్న పదం పాపులర్ కాకముందే పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ అయిన మూవీ రోబో. రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ సినిమా సౌత్ సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో ప్రూవ్ చేసింది. అప్పటి వరకు ఇండియన్ సినిమా వసూళ్ల పరంగా చూడని బిగ్ నెంబర్స్‌ని టచ్ చేసింది రోబో. రోబో సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని సీక్వెల్‌ను మరింత భారీగా రూపొందించారు శంకర్.
Satish Reddy Jadda | Edited By: Phani CH
Updated on: Nov 03, 2023 | 7:51 PM

పాన్ ఇండియా అన్న పదం పాపులర్ కాకముందే పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ అయిన మూవీ రోబో. రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ సినిమా సౌత్ సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో ప్రూవ్ చేసింది. అప్పటి వరకు ఇండియన్ సినిమా వసూళ్ల పరంగా చూడని బిగ్ నెంబర్స్‌ని టచ్ చేసింది రోబో.

రోబో సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని సీక్వెల్‌ను మరింత భారీగా రూపొందించారు శంకర్. మరోసారి రజనీని రోబోగా ప్రజెంట్ చేస్తూ భారీ బడ్జెట్‌తో 2 పాయింట్ ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కానీ సినిమా కమర్షియల్‌గా భారీ వసూళ్లు సాధించినా... టాప్ పరంగా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయింది. అయినా సరే రోబో ఫ్యాన్స్ మాత్రం ఈ సిరీస్‌లో మరో మూవీ వస్తే చూడాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

తాజాగా రోబో అభిమానులను ఖుషీ చేసే న్యూస్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ సిరీస్‌తో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ను సిద్ధం చేస్తున్నారట మేకర్స్. ఆల్రెడీ పార్ట్ 3 కోసం శంకర్ కథను కూడా సిద్ధం చేశారన్నది నయా అప్‌డేట్. ప్రజెంట్ గేమ్ చేంజర్, ఇండియన్ 2 సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్న శంకర్, ఆ తరువాత చేయబోయే మూవీ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రణవీర్ సింగ్ హీరోగా అన్నియన్ 2 ఉంటుందని చెప్పినా... ఆ మూవీ ఇమిడియట్‌గా సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు.

గేమ్ చేంజర్, ఇండియన్ 2 తరువాత శంకర్ చేయబోయేది రోబో 3నేనా అన్న డిస్కషన్ కూడా మొదలైంది. రీసెంట్‌గా జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు రజనీకాంత్. ఈ సినిమాతో 500 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన రజనీ కుర్ర హీరోలకు కూడా షాక్ ఇచ్చారు. ఈ మార్కెట్ స్టామినాను దృష్టిలో పెట్టుకొని రజనీతో మరోసారి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు శంకర్.

అయితే ప్రజెంట్ శంకర్ గ్రాఫ్ చూస్తే రజనీకాంత్ ఆయనకు ఓకే చెప్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. శంకర్ నుంచి సూపర్ హిట్ వచ్చి చాలా రోజులు అవుతుంది. రజనీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. మరి ఈ సిచ్యుయేషన్‌లో శంకర్‌తో సినిమాకు రజనీ ఓకే అంటారా..? లేదా? ఆసక్తికరంగా మారింది.





























