“మే”లో విడుదలకు సిద్ధమవుతున్న చిన్న సినిమాలు
థియేటర్లలో సినిమాలే లేవు. అంతా డ్రైగా ఉంది. ఆ మధ్య కరోనా సమయంలో కంప్లీట్ లాక్ డౌన్ సమయంలో వేసవి ఇంత బోసి పోయి చూశాం. మళ్లీ ఇప్పుడు స్టార్ల సందడి లేక కళ తప్పింది... అనే మాటలు చాలానే వినిపిస్తున్నాయి. అంత పెద్ద మాటలు ఎందుకులే బాసూ... థియేటర్లలోకి మేం వస్తున్నాం అని ముందుకొస్తున్నాయి చిన్న సినిమాలు. కంటెంట్‌లో దమ్ముంటే కోట్లు కురిపించడానికి ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారన్నది మన దగ్గర చాలా సార్లు ప్రూవ్ అయింది.
Updated on: May 02, 2024 | 7:48 PM

సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ప్రసన్నవదనం. ఈ సినిమా మే 3న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ , రాశీ సింగ్ హీరోయిన్లు.

బాక్ టు పెవీలియన్ అంటున్నారు అల్లరి నరేష్. ఆయన స్ట్రెంగ్తెన్ ఏరియా కామెడీలోకి అడుగు పెడుతున్నారు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో మే 3న నవ్వులు కురిపించడానికి నేను రెడీ అంటున్నారు అల్లరి నరేష్. థ్రిల్లింగ్ అంశాలు పంచడానికి సేమ్ డేట్‌కి ప్రసన్నవదనంతో పలకరిస్తున్నారు సుహాస్

వచ్చే వారం సత్యదేవ్‌కి కృష్ణమ్మ విడుదలవుతుంది. మే 17న మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సత్యభామ, రాజు యాదవ్ బరిలోకి దిగుతున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద ఎలాగూ మంచి బజ్ ఉంది. కాజల్‌కి రీ ఎంట్రీ సినిమాగా సత్యభామ హిట్ కావాల్సిన కంపల్సరీ సిట్చువేషన్ ఉంది

ఆశిష్ఆత్మతో ప్రేమలో పడే సినిమా లవ్ మీ. మే 25న గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు దిల్‌రాజు. న్యూ ఏజ్ సినిమాగా తప్పకుండా క్లిక్ అవుతుందనే నమ్మకం కనిపిస్తోంది యూనిట్‌లో.

మే 31న కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. మ్యూజిక్ షాప్ మూర్తి, హరోం హర అదే రోజున విడుదలవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ ఫస్ట్ టైమ్ యాక్షన్ జోనర్‌లో నటిస్తున్న గం గం గణేశా మే 31మీద ఖర్చీఫ్ వేసేసింది. మే నెల మొత్తం క్లియరెన్స్ సేల్‌లాగా కనిపిస్తున్నా, హాట్ సమ్మర్‌లో కూల్‌గా కలెక్షన్లు తెచ్చిపెట్టే వెరైటీ కంటెంట్ కళ్ల ముందు కనిపిస్తోందని అంటున్నారు క్రిటిక్స్.




