Trivikram: బాంబ్ పేల్చిన త్రివిక్రమ్.. ఇది ఊహించలేదుగా..
త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఏంటి..? ఏ హీరోతో ఉండబోతుంది..? చిన్న సైజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఉండే ట్విస్టులన్నీ తన తర్వాతి సినిమా విషయంలో చూపిస్తున్నారు మాటల మాంత్రికుడు. నిన్నటి వరకు ఓ హీరో అన్నారు.. ఇప్పుడేమో కాదు కాదు మరో హీరో అంటున్నారు. మధ్యలో మరో హీరో నేనున్నానంటున్నారు. అసలింతకీ త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..?
Updated on: Jun 13, 2025 | 9:50 PM

గుంటూరు కారం తర్వాత మరోసారి త్రివిక్రమ్‌కు లాంగ్ బ్రేక్ తప్పలేదు. అల్లు అర్జున్‌తో సినిమా అనౌన్స్ చేసినా.. ఇప్పటి వరకు అది మొదలవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే కనిపిస్తుంది. ఆ ప్లేస్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లు తెలుస్తుంది.

నిజానికి అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ అనౌన్స్ చేసిన సినిమా ఎన్టీఆర్‌తోనే..!హీరోలను రిపీట్ చేసే అలవాటున్న త్రివిక్రమ్.. అరవింద సమేత తర్వాత బన్నీతో అల వైకుంఠపురములో చేసారు.

ఆ తర్వాత మరోసారి తారక్‌తోనే సినిమా ప్రకటించారు.. కానీ అనుకోని విధంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి మహేష్ మధ్యలో వచ్చేసారు.. ఆయనతో గుంటూరు కారం చేసారు గురూజీ. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా అన్నారు.. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ రేసులోకి వచ్చారు.

పుష్ప 2 విడుదలకు ముందే అల్లు అర్జున్ సినిమా ప్రకటించారు త్రివిక్రమ్. మైథాలజీ నేపథ్యంలో ఈ సినిమా రానుందన్నారు నిర్మాత నాగవంశీ. కానీ అట్లీ సినిమా వైపు అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడవే నిజమయ్యాయి.. ఇదే సినిమాను ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. నాగవంశీ కూడా కార్తికేయ స్వామిపై ఓ ట్వీట్ చేసారిప్పుడు.

ఎన్టీఆర్ మాత్రమే కాదు.. రామ్ చరణ్‌తోనూ త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారని తెలుస్తుంది. దాంతో పాటే తారక్ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఉంది. ప్రస్తుతం పెద్దితో పాటు సుకుమార్ సినిమాలకు కమిటయ్యారు రామ్ చరణ్. అలాగే ప్రశాంత్ నీల్ డ్రాగన్, దేవర 2తో బిజీగా ఉన్నారు తారక్. మరి వీళ్లలో ఎవరు గురూజీతో ముందు పని చేస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది.



















