Trisha Krishnan: ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ , ఇంకోవైపు స్టార్ హీరోల సినిమాల్లో త్రిష హవా వేరే లెవల్.
హీరోలు 40 ఏళ్లైనా స్టార్స్‌గా కొనసాగొచ్చు మన ఇండస్ట్రీలో.. కానీ హీరోయిన్లకు మాత్రం ఏజ్ లిమిట్ ఉంటుంది. పదేళ్లు స్టార్ హీరోయిన్‌గా కొనసాగితేనే అమ్మో అనుకుంటారు.. అలాంటిది 20 ఏళ్లైనా ఇంకా అదే రేంజ్ మెయింటేన్ చేస్తున్నారు త్రిష. ఈమె క్రేజ్ చూస్తుంటే అందరికీ మతిపోతుంది. ప్రస్తుతం టాప్ స్టార్స్‌తో జోడీ కడుతున్నారీ ఈ బ్యూటీ. అసలు త్రిషకు మాత్రమే ఇదెలా సాధ్యమవుతుంది.? ఏజ్ 40. కానీ క్రేజ్ మాత్రం ఇన్ఫినిటీ.. త్రిషను చూస్తుంటే ఇప్పుడిదే అనిపిస్తుంది.