- Telugu News Photo Gallery Cinema photos Tollywood Top Trending Topics on 19th august 2023 check here details telugu cinema news
Tollywood: టాలీవుడ్ టాప్ ట్రెండింగ్ న్యూస్.. గుంటూరు కారం రీస్టార్ట్..
గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. గురువారం నుంచి లీడ్ యాక్టర్స్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో మహేష్ బాబు కూడా సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Updated on: Aug 19, 2023 | 10:37 PM

Gunturu Karam - గుంటూరు కారం రీస్టార్ట్ గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. గురువారం నుంచి లీడ్ యాక్టర్స్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో మహేష్ బాబు కూడా సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tiger - టైగర్ నాగేశ్వరరావు టీజర్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా టైగర్ నాగేశ్వరరావు. 1970లలో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ అయిన స్టూవర్ట్‌పురం దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.

Manchu Vishnu - రిస్క్ తీసుకుంటున్న మంచు విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. షోకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి కన్నప్ప సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, ఈ సినిమా విషయంలో రిస్క్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు విష్ణు.

Rajinikanth - ఆధ్యాత్మిక యాత్రలో రజనీ జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉన్నారు. రాంచీలోని పరమహంస యోగానంద ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ గంటపాటు ధ్యానం చేసిన రజనీ, తరువాత రాజ్ భవన్‌లో ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశయమ్యారు. అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లనున్నారు రజనీ.

Mammotty - భ్రమయుగంలో మమ్ముట్టి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లీడ్ రోల్‌లో మరో మూవీ ఎనౌన్స్ అయ్యింది. వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భ్రమయుగం అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. రాహుల్ సదాశివన్ దర్శకుడు. హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.




