- Telugu News Photo Gallery Cinema photos Tollywood Star Heroes Targeting For 1000 Cr Collection Telugu Heroes Photos
Tollywood: ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు.?
బిగ్ టార్గెట్ పెట్టుకోవడం తేలికే. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. మంచి కథ కావాలి. దాన్ని సమర్థవంతంగా నడిపించే కెప్టెన్ కావాలి. కన్వీనియంట్ రిలీజ్ టైమ్ ఉండాలి... ఇంకా ఎన్నో ఎనెన్నో.. మరి అన్నిటినీ దాటి ఆ వెయ్యి కోట్ల కుంభస్థలాన్ని కొట్టడానికి క్యూలో మన ముందు నలుగురు స్టార్ హీరోలు కనిపిస్తున్నారు.. ఎవరి నీడా లేకుండా.. సొంతంగా ట్రయల్స్ వేస్తున్నారు. వీళ్లల్లో ఈ సారి నెగ్గుకొచ్చేదెవరు? ఓ సౌత్ డైరక్టర్ వెయ్యి కోట్లను దాటి,
Updated on: Apr 16, 2024 | 9:38 PM

బిగ్ టార్గెట్ పెట్టుకోవడం తేలికే. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. మంచి కథ కావాలి. దాన్ని సమర్థవంతంగా నడిపించే కెప్టెన్ కావాలి. కన్వీనియంట్ రిలీజ్ టైమ్ ఉండాలి... ఇంకా ఎన్నో ఎనెన్నో.. మరి అన్నిటినీ దాటి ఆ వెయ్యి కోట్ల కుంభస్థలాన్ని కొట్టడానికి క్యూలో మన ముందు నలుగురు స్టార్ హీరోలు కనిపిస్తున్నారు..

మాహిష్మతి రక్తంతో రాసిన కొత్త కథ అంటూ 'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' పేరుతో యానిమేటెడ్ సీరీస్ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 17 నుంచి ఈ సీరీస్ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సినిమా కథను, పాత్రలను ట్రైలర్‌లో వివరించిన విధానం అందరి మెప్పూ పొందుతోంది.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే యుఎస్‌పీతో సెకండ్ పార్టుకి కలెక్షన్ల వర్షం కురిపించారు జక్కన్న. ఆ సినిమా తర్వాత ఆ మార్కును టచ్ చేయడానికి ఎంతగానో ట్రై చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటివరకు ఆయన వల్ల కాలేదు. మరి నెక్స్ట్ సినిమాలతో అయినా సాధ్యమవుతుందా? లేకుంటే దండాలయ్యా అంటూ రాజమౌళినే ఇంకోసారి ఆశ్రయించాలా?

ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనే సామెత మన దగ్గర చాలా పాపులర్. అలా ఒక్క సినిమాతో ఇద్దరు హీరోలకు వెయ్యికోట్ల సినిమాను ఇచ్చేశారు జక్కన్న. ట్రిపుల్ ఆర్ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్లేస్‌ని పదిలం చేసుకున్నారు తారక్ అండ్ చరణ్.

ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవల్లో వీళ్లిద్దరూ పాపులర్ స్టార్లే. మాస్ ఆఫ్ మాసెస్.. మిస్టర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్... మెగా రామ్ చరణ్... ఈ హీరోలు ఇద్దరి ముందూ ఇప్పుడున్నది ఒక్కటే టార్గెట్. దేవరతో తారక్, గేమ్‌చేంజర్‌తో చెర్రీ.. వెయ్యికోట్లను కలెక్ట్ చేసి చూపించాలి.

అప్పుడే ట్రిపుల్ ఆర్ ఘనత జస్ట్ రాజమౌళిది మాత్రమే కాదు, హీరోలది కూడా అని ప్రూవ్ అవుతుంది. ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా, జస్ట్ అలా ఉత్తరాది మీద వదిలేశారు పుష్ప పార్ట్ ఒన్‌ని. భీభత్సమైన కలెక్షన్లను, పేరు ప్రతిష్టలను, జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది ఆ సినిమా.

మరి ఆ సినిమా తెచ్చిన ఫేమ్‌తో సెకండ్ పార్టు రేంజ్... ఏ రేంజ్‌లో కనిపించాలి? వెయ్యికోట్లకు రూపాయి తగ్గినా ఒప్పుకునేలా లేరు ఫ్యాన్స్. ఎలాగైనా ఆ థౌజండ్ క్రోర్స్ క్లబ్‌లో పుష్ప2తో ప్లేస్‌ని పదిలం చేసుకోవాలని బన్నీకి రిక్వెస్టులు పెడుతోంది అల్లు ఆర్మీ.





























