- Telugu News Photo Gallery Cinema photos Jr. NTR Vs Hrithik Roshan Dance Competition in War 2 Movie updates Telugu Heroes Photos
Jr. NTR Vs Hrithik Roshan: తారక్ vs హృతిక్.. నాటు నాటుని నార్త్ బీట్ చేస్తుందా.?
ఆస్కార్ వేదిక మీద రిపీటెడ్‌గా వినిపించిన నాటు నాటును బీట్ చేసే పాట నార్త్ ఇండియాలో సిద్ధమవుతోందా? ముంబై సెట్స్ లో ఇప్పుడు తారక్ అలాంటి పాటకే స్టెప్పులేస్తున్నారా? ముంబై సర్కిల్స్ లో ది బెస్ట్ డ్యాన్సర్‌గా పేరుంది హృతిక్ రోషన్‌కి. సీనియర్ హీరోయిన్లు రంభ, రమ్యకృష్ణ నుంచి.. ఇవాళ్టి ఐటమ్ సాంగుల స్పెషలిస్టు ఊర్వశి రౌతేలా వరకు.. అందరూ మన దగ్గర తారక్ డ్యాన్సులకి ఫ్యాన్సే.
Updated on: Apr 16, 2024 | 9:18 PM

ఆస్కార్ వేదిక మీద రిపీటెడ్‌గా వినిపించిన నాటు నాటును బీట్ చేసే పాట నార్త్ ఇండియాలో సిద్ధమవుతోందా? ముంబై సెట్స్ లో ఇప్పుడు తారక్ అలాంటి పాటకే స్టెప్పులేస్తున్నారా? ముంబై సర్కిల్స్ లో ది బెస్ట్ డ్యాన్సర్‌గా పేరుంది హృతిక్ రోషన్‌కి.

సీనియర్ హీరోయిన్లు రంభ, రమ్యకృష్ణ నుంచి.. ఇవాళ్టి ఐటమ్ సాంగుల స్పెషలిస్టు ఊర్వశి రౌతేలా వరకు.. అందరూ మన దగ్గర తారక్ డ్యాన్సులకి ఫ్యాన్సే. అందుకే హృతిక్ అండ్ తారక్ కలిసి వేసే స్టెప్పుల గురించి ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు జనాలు.!

వార్‌లో ఈ పాటకు నార్త్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హృతిక్, టైగర్ ష్రాఫ్.. ఇద్దరూ సూపర్‌డూపర్ డ్యాన్సర్లు. కండలు తిరిగిన హీరోలు. స్టైలిష్, మాస్ యాక్షన్ సీక్వెన్స్ లోనే కాదు, స్టెప్పులేయడంలోనూ తిరుగులేదనిపించుకున్నారు.

ముంబైలో వార్2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. అక్కడ జరిగే బీ టౌన్ పార్టీలకు కూడా హాజరవుతున్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా, హృతిక్ రోషన్, కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన పార్టీకి భార్యతో కలిసి వెళ్లారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా వార్2. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్, హృతిక్ పాల్గొంటారు. మే రెండో వారం నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.

ఇద్దరి మీదా సాంగ్ షూట్ జరుగుతోందట. ఒకరు కాదు, ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లు వర్క్ చేస్తున్నారు ఈ సాంగ్ కోసం. జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ ఇద్దరూ కలిసి స్టెప్పులు కంపోజ్ చేశారట. మరి ఆ స్టెప్పులు నాటు నాటులో పాటలా.. ఇద్దరు హీరోలు కలిసి కాలు కదిపేలా.. సిమిలర్‌గా ఉంటాయా?

వంటి విషయాలు కూడా డిస్కషన్‌లో ఉన్నాయి. ఏదైమైనా నాటు నాటును, జై జై శివశంకర్‌ను మించేలా వార్2 సాంగ్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఫిల్మీ సర్కిల్స్ లో.





























