- Telugu News Photo Gallery Cinema photos Tollywood Upcoming Movies Shooting Update in 2024 Telugu Heroes Photos
Tollywood: స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
విన్నారా.. మీ స్టార్లు.. ఈ ఈ లొకేషన్లలో ఉన్నారు అని మొన్నటికి మొన్నే చెప్పుకున్నాం కదా.. అప్పుడే వారం తిరిగిపోయింది. ఈ వారం కూడా సేమ్ లొకేషన్‌కే స్టిక్ ఆన్ అయి ఉన్నవారు ఎంత మంది? కొత్త లొకేషన్లకి షిఫ్ట్ అయిన వారు ఎంత మంది.? ఇంతకీ మే 9న ఉన్నట్టా? లేనట్టా అని అందరినీ ఊరిస్తున్న కల్కి సినిమా షూటింగ్ ఇప్పుడు.. శంకర్‌పల్లిలో జరుగుతోంది. శర్వానంద్ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమా మణికొండ డాలర్ హిల్స్ లో జరుగుతోంది.
Updated on: Apr 16, 2024 | 9:59 PM

ఆ టైమ్‌లో ఏమాత్రం తడబడినా, ఆ ఇంపాక్ట్ సినిమా మీద భీభత్సంగా ఉంటుందన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయం. అందుకే ప్రతి ఫ్రేమ్‌ని భూతద్దంలో చూసుకుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాల్సిన అలర్ట్ జోన్‌లో ఉన్నారు నాగ్ అశ్విన్.

ఇంతకీ మే 9న ఉన్నట్టా? లేనట్టా అని అందరినీ ఊరిస్తున్న కల్కి సినిమా షూటింగ్ ఇప్పుడు.. శంకర్‌పల్లిలో జరుగుతోంది. శర్వానంద్ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమా మణికొండ డాలర్ హిల్స్ లో జరుగుతోంది.

ఇప్పటికే ఫస్టాఫ్ అయిపోయింది.. సెకండాఫ్ షూట్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు ఈ స్టార్ కెరీర్‌లో. యాక్షన్ మూవీస్‌ని అద్భుతంగా తీస్తారనే పేరు తెచ్చుకున్న లింగుస్వామి, బోయపాటి కాంబినేషన్‌లో పనిచేసినా వర్కవుట్ కాలేదు.

ఆగస్టు 15 కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన పుష్ప ప్యాన్ ఇండియా రేంజ్‌లో తడాఖా చూపించింది.

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా షూటింగ్ లక్నోలోనే కంటిన్యూ అవుతోంది.మొన్నటివరకు దేవర షూటింగ్‌లో ఉన్న తారక్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అక్కడ హృతిక్‌తో కలిసి వార్2 సెట్‌లో స్టెప్పులేస్తున్నారు.

మంచు విష్ణు భక్త కన్నప్ప షూటింగ్ కూడా ఆర్ ఎఫ్ సీ జరుగుతుంది. నితిన్ హీరోగా వెంకీ కుడుములు తెరకెక్కిస్తున్న రాబిన్ హుడ్ మూవీ మొయినాబాద్ లో జరుగుతుంది.




