- Telugu News Photo Gallery Cinema photos Tollywood producer investing huge budget on heroes like dulquer salmaan adivi sesh Nikhil
కటౌట్ చూసి వంద కోట్లు పెట్టేయొచ్చంటున్న మేకర్స్.. ఆ హీరోలు ఎవరంటే ??
కథలో దమ్ముండాలి... దాన్ని స్క్రీన్ మీద పోట్రే చేయగల తెగువ ఆర్టిస్టుల్లో ఉండాలి... అలాంటి వారిని నమ్మి వంద కోట్ల బడ్జెట్‌లు పెట్టినా ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాతలు ధైర్యం చేస్తారు. డిస్ట్రిబ్యూటర్లు బిజినెస్ చేయడానికి ముందుకొస్తారు. లేటెస్ట్ గా అలాంటి హీరోలు కొందరి గురించి టాక్ స్ప్రెడ్ అవుతోంది. అడివి శేష్ కెరీర్‌లో గూఢచారి సినిమాకున్న ప్లేస్ ఏంటో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.
Updated on: Aug 31, 2024 | 12:51 PM

కథలో దమ్ముండాలి... దాన్ని స్క్రీన్ మీద పోట్రే చేయగల తెగువ ఆర్టిస్టుల్లో ఉండాలి... అలాంటి వారిని నమ్మి వంద కోట్ల బడ్జెట్‌లు పెట్టినా ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాతలు ధైర్యం చేస్తారు.

డిస్ట్రిబ్యూటర్లు బిజినెస్ చేయడానికి ముందుకొస్తారు. లేటెస్ట్ గా అలాంటి హీరోలు కొందరి గురించి టాక్ స్ప్రెడ్ అవుతోంది. అడివి శేష్ కెరీర్‌లో గూఢచారి సినిమాకున్న ప్లేస్ ఏంటో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.

2018లో జస్ట్ ఆరు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 23న్నర కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అప్పుడు శేష్ స్టామినా వేరు... ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఆయనకున్న మార్కెట్ వేరు. అందుకే ధైర్యంగా వంద కోట్లు పెట్టి జీ2ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

హీరోని నమ్మి ఎంతైనా పెట్టొచ్చనే కేటగిరీలో ఇమీడియేట్‌గా గుర్తుకొచ్చే పేరు దుల్కర్ సల్మాన్. సినిమా సినిమాకూ తనదైన స్పెషాలిటీతో ముందుకు దూసుకుపోతున్నారు దుల్కర్ సల్మాన్. ఆయన నటించిన లక్కీ భాస్కర్ కోసం ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు దుల్కర్ అభిమానులు.

ఈ కేటగిరీలో ప్లేస్ సంపాదించుకున్న మరో తెలుగు హీరో నిఖిల్. కార్తికేయ2 కలెక్షన్లు చూసిన తర్వాత నిఖిల్ సినిమాకు ధైర్యంగా ఖర్చుపెట్టొచ్చనుకుంటున్నారు నిర్మాతలు. ఆయన నటిస్తున్న స్వయంభుకి 50 ప్లస్ కోట్ల ఖర్చవుతోంది. ది ఇండియా హౌస్‌ని దాదాపు 80 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. కథ, దానికి తగ్గ హీరో ఉంటే.. భారీ బడ్జెట్ పెట్టడానికి కూడా వెనకాడటం లేదు నిర్మాతలు.




