AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..

పుష్ప పుష్ప పాట హుక్‌ స్టెప్‌ చాలా బావుందని, ఇప్పుడు మళ్లీ దాన్ని నేర్చుకోవాలని అన్నారు ఆసీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఆయన కామెంట్‌కి అల్లు అర్జున్‌ స్పందించారు. ఇది చాలా ఈజీ. ఈ సారి మనం కలిసినప్పుడు నేను నేర్పిస్తాను అని రిప్లై ఇచ్చారు. పుష్ప పుష్ప పాట కోట్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. మూడు భాషల్లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మాహిష్మతి రక్తంతో రాసిన కొత్త కథ అంటూ 'బాహుబలి క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌' పేరుతో...

Anil kumar poka
|

Updated on: May 04, 2024 | 9:09 PM

Share
ఆ పాటకు తగ్గట్టు షూ స్టెప్‌, ఫోన్‌ స్టెప్‌ అని పెర్ఫార్మ్ చేసి, తన మార్క్ ని మరోసారి చూపించేశారు బన్నీ.  కల్ట్ కేరక్టర్‌లో తమ అభిమాన నటుడిని చూసుకోవడానికి రెడీ అవుతున్నారు జనాలు.

1 / 7
మరోవైపు ప్రమోషన్లు కూడా అంతే వేగంగా, ప్లాన్డ్ గా జరుగుతున్నాయి. ఇవ్వబోయే అప్‌డేట్‌ ముందు నుంచే సోషల్‌ మీడియాలో మారుమోగుతోంది. అప్‌డేట్‌ వచ్చాక ఆ ట్రెండ్‌ కంటిన్యూ అవుతోంది.

2 / 7
మాహిష్మతి రక్తంతో రాసిన కొత్త కథ అంటూ 'బాహుబలి క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌' పేరుతో యానిమేటెడ్‌ సీరీస్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 17 నుంచి ఈ సీరీస్‌ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.  సినిమా కథను, పాత్రలను ట్రైలర్‌లో వివరించిన విధానం అందరి మెప్పూ పొందుతోంది.

3 / 7
తన నిశ్చితార్థ విషయాన్ని మీడియాకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న దానిమీద  మీద క్లారిటీ ఇచ్చారు అదితిరావు హైదరీ. పెళ్లి గురించి పలువురు అదితిరావు హైదరి తల్లికి ఫోన్లు చేశారట.

4 / 7
సిద్ధార్థ్‌ పరిచయం కావడం వల్ల ప్రేమపై తనకు నమ్మకం పెరిగిందని అన్నారు నటి అదితిరావు హైదరి. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగించకూడదని కోరారు అదితిరావు.

5 / 7
కెరీర్‌ ప్రారంభంలో సుప్రీమ్‌ సినిమాలో తాను చేసిన బెల్లం శ్రీదేవి పాత్రను గుర్తుచేసుకున్నారు నటి రాశీ ఖన్నా. కామెడీ టైమింగ్‌ ఉన్న కేరక్టర్‌ను తాను చేస్తానని ఊహించలేదని అన్నారు. శ్రీదేవి కేరక్టర్‌ తనను తనకు కొత్తగా పరిచయం చేసిందని చెప్పారు. అలాగే పక్కా కమర్షియల్‌ సినిమాలో ఏజెంల్‌ ఆర్న కేరక్టర్‌ చేయడానికి కూడా భయపడ్డానని అన్నారు.

6 / 7
డబ్బు కోసమో, పేరు కోసమో సినిమా ఇండస్ట్రీకి వస్తే కొంత కాలం మాత్రమే ప్రయాణం చేయగలమని అన్నారు నటి తమన్నా. అదే కళ కోసం వచ్చిన నటీనటులు మాత్రం సుదీర్ఘమైన ప్రయాణం చేస్తారని చెప్పారు. సినిమా సినిమాకీ ప్రేక్షకులకు వైవిధ్యం చూపించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు తమన్నా.

7 / 7