- Telugu News Photo Gallery Cinema photos Tollywood Heroes making movies based on forest theme, including Chiranjeevi Vishwambhara movie
అడవి బాట పడుతున్న హీరోలు.. మెగాస్టార్ మాటేంటి ??
ట్రెండ్‌లో ఏది ఉంటే.. గుడ్డిగా దాన్ని ఫాలో అయిపోవడమే..! కొన్ని సార్లు అదే ప్లస్ అవుతుంది. మరికొన్ని సార్లు ఫ్లోలో కొట్టుకుపోవడమే కలిసొస్తుంది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ట్రెండింగ్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఫారెస్టే. ఇండస్ట్రీ హిట్ పుష్ప2 కూడా సేమ్ బ్యాక్ డ్రాప్‌లోనే తెరకెక్కింది... మరి సెట్స్ మీద ఇంకేం సినిమాలున్నాయి?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 20, 2025 | 2:15 PM

ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ పుష్పరాజ్ ఫస్ట్ పార్టుతో మొదలుపెట్టినప్పుడే అందరికీ అర్థమైంది శేషాచలం అడవుల్లో జరిగే కథ అని. పుష్ప సీక్వెల్‌లోనూ గంధపు చెక్కల స్మగ్లింగ్ మేజర్ రోల్ ప్లే చేసింది. వరల్డ్ వైడ్ ఆడియన్స్ మనసులను కొల్లగొట్టింది కాబట్టే ఇండస్ట్రీ హిట్ అయింది ఈ మూవీ.

ఇప్పుడు కెన్యా అడవుల్లో మహేష్‌తో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటుంది. మహేష్‌ని నెవర్ బిఫోర్ అవతార్‌లో చూపించడానికి సర్వం సిద్ధం చేశారు జక్కన్న.

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది. ఇందులో శర్వానంద్ తెలంగాణ యాసలో మాట్లాడుతారని సమాచారం.

బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఓ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. అనుష్క ఘాటీ మొత్తం అడవుల నేపథ్యంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది ఘాటీ మూవీ.

ఈ సినిమా మీద స్వీటీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, క్రిష్ జాగర్ల మూడి కూడా గట్టి హోప్స్ పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరలోనూ అడవుల నేపథ్యంలో సన్నివేశాలుంటాయని టాక్.





























