- Telugu News Photo Gallery Cinema photos Actress priyamani latest saree photos goes viral on internet
Priyamani: చీరకట్టులో చందమామలా మెరిసిపోతున్న ప్రియమణి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్
తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అందాల భామ ప్రియమణి. తెలుగులో ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాతో తెలుగులో భారీ హిట్ అందుకుంది.
Updated on: Feb 20, 2025 | 1:57 PM

తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అందాల భామ ప్రియమణి. తెలుగులో ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాతో తెలుగులో భారీ హిట్ అందుకుంది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిన్నది పలు సినిమాలు చేసింది. తమిళ్ లో తెరకెక్కిన పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుందని ప్రియమణి.

అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ప్రియమణి సినిమాల స్పీడ్ తగ్గించింది.

అడపాదడపా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించింది .

ఇక సోషల్ మీడియాలో ప్రియమణి షేర్ చేసే ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. తాజాగా ప్రియమణి కొన్ని ఫోటోలను వదిలింది. చీరకట్టులో చందమామలా మెరిసిపోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.