- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes changing their look for upcoming movies like pawan kalyan suriya jr ntr
వెండితెర మీద పై నయా ట్రెండ్.. ఆడియన్స్ మెప్పుకోసం లుక్ మార్చేస్తున్న హీరోస్..
ప్రజెంట్ వెండితెర మీద నయా ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో అన్ని రకాల ఆడియన్స్‌ను మెప్పించాలంటే డిఫరెంట్ సెటప్ కావాల్సిందే అంటున్నారు మేకర్స్. అందుకే రొటీన్ కథలను పక్కన పెట్టి... కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. పవర్ స్టార్ కూడా కాస్ట్యూమ్ డ్రామా ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ మూవీస్ చేస్తూనే హరి హర వీరమల్లు లాంటి ఫోక్‌లోర్ కాన్సెప్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా వింటేజ్ లుక్‌లో కనిపించబోతున్నారు పవర్ స్టార్.
Updated on: Sep 20, 2023 | 3:34 PM

ప్రజెంట్ వెండితెర మీద నయా ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో అన్ని రకాల ఆడియన్స్‌ను మెప్పించాలంటే డిఫరెంట్ సెటప్ కావాల్సిందే అంటున్నారు మేకర్స్. అందుకే రొటీన్ కథలను పక్కన పెట్టి... కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు.

పవర్ స్టార్ కూడా కాస్ట్యూమ్ డ్రామా ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ మూవీస్ చేస్తూనే హరి హర వీరమల్లు లాంటి ఫోక్‌లోర్ కాన్సెప్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా వింటేజ్ లుక్‌లో కనిపించబోతున్నారు పవర్ స్టార్.

కార్తికేయ 2తో పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్ కూడా డిఫరెంట్ మూవీని ట్రై చేస్తున్నారు. స్వయంభు పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో వారియర్‌గా రాయల్ లుక్‌లో కనిపిస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అయితే వరుసగా ప్రయోగాత్మ చిత్రాలే చేస్తున్నారు. ప్రజెంట్ కంగువా వర్క్‌లో బిజీగా ఉన్న నడిప్పిన్ నాయగన్, నెక్ట్స్ బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్‌లో మైథలాజికల్ మూవీ కర్ణలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర కూడా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న మూవీనే. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్.




