Suriya: హిట్టు కోసం సూర్య నయా ఫార్ములా.. ఈ సారైనా సక్సెస్ అయ్యేనా ??
వరస ఫ్లాపులు వస్తున్నా తగ్గేదే లే అంటున్నారు సూర్య. గ్యాప్ ఎంత తక్కువ తీసుకుంటే.. అంత వేగంగా బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చు అనేది సూర్య ప్లాన్. ప్రస్తుతం ఇదే చేస్తున్నారీయన. పైగా ఈయన స్పీడ్ చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. కంగువా, రెట్రో గాయాల నుంచి కోలుకోవాలంటే వరస సినిమాలు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదంటున్నారీయన.
Updated on: Jun 21, 2025 | 12:37 PM

కొన్నేళ్లుగా సూర్య రేంజ్‌కు తగిన సినిమా రావట్లేదనేది నిజం. ఆయనకు తగిన పడిన రోజు రెస్పాన్స్ ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్‌లో రోలెక్స్ కారెక్టర్‌ను చూస్తే చాలు.

ఈయనకు సరైన హిట్ వచ్చి దశాబ్ధం దాటేసింది. మధ్యలో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ అద్భుతాలు చేసినా.. అవి ఓటిటికే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సూర్య.

గతేడాది కంగువాపై భారీ ఆశలు పెట్టుకున్న సూర్యకు అది మామూలు షాక్ ఇవ్వలేదు. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ప్రయోగాలు కాదని.. కమర్షియల్ కథలే చేద్దామనుకుంటే రెట్రో కూడా ఫ్లాపైంది.

కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా దారుణంగా నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈయన ఆర్జే బాలాజీతో ఓ సినిమా చేస్తున్నారు. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే.. మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య.

RJ బాలాజీ సినిమాకు కరుప్పు అనే టైటిల్ ఖరారు చేసారు. ఇది సెట్స్‌పై ఉండగానే.. వెంకీ అట్లూరి సినిమాకు ఓకే చెప్పారు సూర్య. ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు సూర్య. ఇన్ని సినిమాల్లో ఏదో ఓ హిట్ రాకపోదా అని వేచి చూస్తున్నారాయన.




