- Telugu News Photo Gallery Cinema photos Nagarjuna's Evolving Career From Romantic Hero to Versatile Actor
Nagarjuna: మన్మథుడి లో మొదలైన మార్పు.. అక్కినేని అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్
మార్పు మంచికే అంటారు కదా..? ఇప్పుడు నాగార్జున ఇదే చేసి చూపిస్తున్నారు. ఆ నలుగురు ఎప్పుడు మారతారు..? ఇంకెన్నాళ్లు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడతారు..? పక్క ఇండస్ట్రీ హీరోలను చూసి కూడా నేర్చుకోరా..? ఇలా మన దగ్గర చాలా కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు మార్పు మొదలైంది.. మన్మథుడితోనే ఆ మార్పు మొదలైంది. మరి ఆయనేం చేస్తున్నారు..?
Updated on: Jun 21, 2025 | 12:25 PM

నాగార్జున పూర్తిగా మారిపోయినట్లేనా..? ఇకపై హీరోగా కనిపించడా..? ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. అయితే అలాంటిదేం లేదని తేల్చేసారు నాగ్. త్వరలోనే ఈయన 100వ సినిమా స్టార్ట్ కానుంది.

దీనికి దర్శకుడు కూడా ఖరారయ్యారు. ముందు నుంచి వినిపించిన తమిళ దర్శకుడు కార్తిక్ పేరునే కన్ఫర్మ్ చేసారు ఈ సీనియర్ హీరో.100వ సినిమాను త్వరలోనే మొదలు పెడతానంటూ నాగ్ చెప్పడంతో గాల్లో తేలిపోతున్నారు అక్కినేని అభిమానులు.

హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ బిజీగానే ఉన్నారీయన. అంతేకాదు కథ నచ్చితే విలన్‌గా కూడా నటించడానికి ఓకే అనేస్తున్నారు నాగ్. ఫ్యాన్స్‌కు కాస్త కష్టంగా ఉన్నా.. నెగిటివ్ రోల్స్ వైపు అడుగులేస్తున్నారు నాగార్జున. ఈ మార్పు మంచికే అంటున్నారాయన.

కూలీ సినిమాలో నాగార్జున చేస్తున్నది నెగిటివ్ క్యారెక్టరే.. అది ఆయనే చెప్పారు కూడా. మరోవైపు కుబేరాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపించారు నాగ్. త్వరలోనే బ్రహ్మాస్త్ర 2తో పాటు మరో రెండు సినిమాలు చేయనున్నారు.

ఇమ్మీడియట్‌గా మాత్రం 100వ సినిమాను మొదలుపెట్టబోతున్నారు నాగార్జున. మొత్తానికి ఒకప్పట్లా వేగంగా కాకుండా.. చాలా సెలెక్టివ్‌గా వెళ్లాలని ఫిక్సైపోయారు ఈ సీనియర్ హీరో.




