Tollywood Heroines: విదేశాల్లో ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ హీరోయిన్లు..

Tollywood Heroines: రెండక్షరాల ప్రేమ.. రెండు జీవితాను కలుపుతుంది. ప్రేమకు జాతి, మతం, కులం దేశం ఇవేమీ అడ్డుకావని సినిమాల్లో చూపిస్తారు.. అయితే అలా సినిమాల్లో నటించిన హీరోయిన్లు నిజ జీవితంలో కూడా ఇతర దేశాల వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. తెలుగు సినిమాల్లో నటించిన కొంత మంది హీరోయిన్లు విదేశీ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో చూద్దాం

Surya Kala

|

Updated on: Jun 15, 2021 | 6:27 PM

దర్శకరత్న దాసరి వెండి తెరకు పరిచయం చేసిన నటీమణుల్లో ఒకరు మాధవి. ఈ అచ్చతెలుగమ్మాయి అసలు పేరు విజయలక్ష్మి. మరో చరిత్ర సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా నటించింది గుర్తింపు తెచ్చుకుంది. మాధవి భర్త భారత, జర్మన్ సంతతికి చెందినవాడు. 1996లో  రాల్ఫ్ శర్మని మాధవి పెళ్లి చేసుకుంది. తన కుటుంబంతో న్యూ జెర్సీ‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.

1 / 7
విజయవాడకు చెందిన అచ్చ తెలుగమ్మాయి రంభ.. దక్షిణాది స్టార్ హీరోలందరితోను నటించిన స్టార్ హీరోయిన్. నటనకు గుడ్ బై చెప్పినా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కనిపించిన రంభ 2010లో కెనడాకి చెందిన ఇంద్ర కుమార్‌ని పెళ్లి  చేసుకుని మొదట అక్కడే సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం

2 / 7
ఈ సొట్ట బుగ్గల సుందరి మహేష్ బాబు హీరోగా వెండి తెరకు పరిచమైన రాజకుమారుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. వెంకటేష్‌తో "ప్రేమంటే ఇదేరాతో ఫ్యాన్స్ ను అలరించిన ఈ లిటిల్ సుందరి హిందీలో స్టార్ హీరోయిన్ . 2016లో అమెరికాకు చెందిన జీనీ గుడ్ ఇనఫ్‌ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అమెరికా, ఇండియా మ‌ధ్య చక్కర్లు కొడుతూ సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

3 / 7
బాలనటి గా వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది లయ. అమెరికాకు చెందిన శ్రీ గణేష్ అనే డాక్టర్‌ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు అమెరికాలోనే సెటిల్ అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు

4 / 7

తన నవ్వుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కేరళ కుట్టి మీరా జాస్మిన్. అమ్మాయి బాగుంది. గుడుంబా శంకర్, భద్ర వంటి సినిమాలో నటించిన మీరా జాస్మిన్ 2014 లో దుబాయ్ కు చెందిన అనిల్ జాన్ అనే ఇంజనీర్‌ని వివాహం చేసుకుంది.

5 / 7
వెంకటేష్ నటించిన సుందరకాండ సినిమా అనగానే వెంటనే చలాకీ అమ్మాయి అపర్ణ గుర్తుకొస్తుంది. వెంకటేష్‌ను ఆటపట్టించే  చిలిపి విద్యార్థిగా నటించిన అపర్ణ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తో అక్క పెత్తనం చెల్లెలు కాపురం అనే సినిమాలో నటించనుంది. తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. 2002లో శ్రీకాంత్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది.

6 / 7
ఫైర్ బ్రాండ్ రాధికా ఆప్టే తెలుగులో బాలీవుడ్ లో నటించింది. ఈ బోల్డ్ సుందరి రక్త చరిత్ర 1 , 2లో పరిటాల సునీత పాత్రలో కనిపించి తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ లెజెండ్ చిత్రంలో నటించిన రాధికా ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ అమ్మ‌డు 2013లో సహ నటుడు బెనెడిక్ట్ టేలర్‌ని పెళ్లి చేసుకుంది. బెనెడిక్ట్ లండన్‌కి చెందిన ఒక థియేటర్ ఆర్టిస్ట్.

7 / 7
Follow us