- Telugu News Photo Gallery Cinema photos Those words are the hook lines for songs, making them trendy songs
Word Songs: ఆ పదాలే పాటలకు హుక్ లైన్స్‌గా.. ట్రెండీగా సాంగ్ లిరిక్స్..
అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు కదా పెద్దలు. ఇప్పుడు మన లిరిక్ రైటర్స్ ఈ మాటనే బాగా గట్టిగా పట్టుకున్నట్లున్నారు. అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలు అల్లేస్తున్నారు. ట్రెండ్ అయిన పదాలనే తీసుకొచ్చి.. హుక్ లైన్స్‌గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ రాస్తున్నారు. తాజాగా అలాంటి పాటే మరోటి వస్తుంది.
Updated on: May 20, 2025 | 11:40 AM

గత ఏడాది మొదట్లో వచ్చిన గుంటూరు కారంలో ఓ మాస్ సాంగ్ నుంచి నెక్స్ట్ ఇయర్ రానున్న రాబిన్ హుడ్‌లో కొత్త సాంగ్ వరుకు చాల సాంగ్స్ ట్రెండ్ అయిన పదాలతోనే వస్తున్నాయి. అవి హిట్ అవుతున్నాయి కూడా. అందుకే వాటినే హుక్ లైన్స్‌గా చేసుకొంటున్నారు లిరిక్ రైటర్స్.

ఆ కుర్చీని మడతబెట్టి.. ఈ మాట ఓ తాత నోట్లోంచి వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తిరిగింది.. అది తమన్‌కు బాగా నచ్చి గుంటూరు కారంలో ట్యూన్ అయింది.. ఆ పాటేమో 10 నెలలు తిరిగేసరికి 500 మిలియన్స్‌కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. దీనంతటికీ ఆ కుర్చీ మడతబెట్టి అనే హుక్ లైనే కారణం.

డబుల్ ఇస్మార్ట్‌లోనూ కేసీఆర్ వాయిస్ వాడుకున్నారు మణిశర్మ. ఏం చేద్దాం అంటవ్ మరి అంటూ అప్పట్లో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్‌లో చెప్పిన మాట బాగా ఫేమస్ అయింది. దాన్నే హుక్ లైన్‌గా తీసుకుని డబుల్ ఇస్మార్ట్‌లో మార్ ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ.

రాబిన్ హుడ్‌లో దిల్ రాజు హుక్‌లైన్‌తో పాట వస్తుంది. అదిదా సర్‌ప్రైజ్ అంటూ సాగే ఈ పాటలో కేతిక శర్మ చిందేస్తున్నారు. సాంగ్ త్వరలోనే రానుంది. అదిదా సారూ.. అంటూ వారసుడు ఆడియో ఫంక్షన్‌లో దిల్ రాజు చెప్పిన మాటలు ఫుల్ ట్రెండ్ అయ్యాయి. దాన్నే ఇప్పుడు నితిన్ సినిమాలో వాడేసారు.

ఇవే కాదు.. అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ చెప్పిన మేడమ్ సార్ మేడమ్ అంతే మాటతో.. ఈ మధ్యే మారుతినగర్ సుబ్రమణ్యం సినిమాలో పాట కట్టేసారు. మొత్తానికి మాటలే పాటలుగా మారిపోతున్నాయిప్పుడు.




