- Telugu News Photo Gallery Cinema photos Prasanth Varma is getting ready to make a film with Prabhas as the hero and Rana Daggubati as the villain
Prabhas-Rana: బాహుబలి కాంబో రిపీట్ కానుందా.? రానా విలన్‌గా డార్లింగ్ మూవీ..
బాహుబలి సినిమాతో వెండితెర మీద మ్యాజిక్ చేశారు ప్రభాస్ రానా. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్‌కు ఎంత పేరొచ్చిందో, విలన్‌గా రానాకి కూడా అంతే పేరొచ్చింది. అందుకే ఈ కాంబోను మరోసారి తెర మీద చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా బాహుబలి కాంబోను రిపీట్ చేసే కథ సిద్ధం రెడీ అవుతుందన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
Updated on: May 19, 2025 | 5:50 PM

బాహుబలి సినిమా సక్సెస్‌లో హీరోగా ప్రభాస్, విలన్‌గా రానా... ఇద్దరు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బాహుబలికి నార్త్‌లో బజ్ రావటం వెనుక రానా కృషి చాలానే ఉంది. అందుకే ఆ తరువాత కూడా ప్రభాస్, రానా కాంబోను రిపీట్ చేసే ప్రయత్నాలు జరిగాయి.

కానీ కథ, డేట్స్ ఇష్యూస్ కారణంగా ఈ కాంబినేషన్ మళ్లీ తెర మీదకు రాలేదు.ఫైనల్‌గా బాహుబలి కాంబోను మళ్లీ తెర మీదకు తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నారు సెన్సేషనల్ టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ప్రభాస్ లీడ్ రోల్‌లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. దీనికి బ్రహ్మ రాక్షస అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ముందు ఆ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను తీసుకోవాలని భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌లో రానాను తీసుకునే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ప్రభాస్ వర్సెస్ రానా... ఆల్రెడీ సూపర్ హిట్ కాంబో కాబట్టి సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వటంలోనూ హెల్ప్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ జరిగితే థియేటర్లలో పూనకాలు రావడం పక్క అంటున్నారు ప్రభాస్, రానా ఫ్యాన్స్.

మార్కెట్ పరంగానూ సౌత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, దక్షిణాదిలో ప్రభాస్ మార్కెట్ రేంజ్‌కు రానా ఇమేజ్ కూడా యాడ్ అయితే కలెక్షన్లు మరింత భారీగా ఉంటాయని భావిస్తున్నారు. మరి ఈ కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.




